బతికి ఉండగానే ఓటు తొలగించారు..
ABN, First Publish Date - 2023-08-22T00:48:16+05:30
తాను బతికి ఉండగానే ఓటు తొలగించారని మండలంలోని జనార్దనవరానికి చెందిన నందమూరి జయమ్మ అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.
చాట్రాయి, ఆగస్టు 21 : తాను బతికి ఉండగానే ఓటు తొలగించారని మండలంలోని జనార్దనవరానికి చెందిన నందమూరి జయమ్మ అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఓటర్ల జాబితాల సవరణలో భాగంగా జరుగుతున్న ఇంటింటి సర్వేలో జయమ్మ ఓటు ఓటర్ల జాబితాలో డెలిటెడ్ అని ఉన్నట్టు టీడీపీ నాయకులు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తన ఓటును తొలగించిన విషయం కూడా టీడీపీ నాయకులు చెబితేనే తెలిసిందని జయమ్మ పేర్కొంది. ప్రతి ఎన్నికల్లోను తాను ఓటు వేశా నని, బతికి ఉండగానే ఓటు తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై ఈవోపీఆర్డీ నాగరాజును వివరణ కోరగా జయమ్మ ఓటును పునరుద్ధరిస్తామన్నారు. మరోవైపు ఇదే గ్రామంలో 35, 36 పోలింగ్ బూత్‌లలో జీరో డోర్ నెంబర్లతో 10 ఓట్లు గుర్తించి సర్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు టీడీపీ నాయకులు పసుపులేటి కోటేశ్వరావు, బలువూరి రత్తయ్య తెలిపారు. జయమ్మ ఓటు తొలగింపుపై తహసీల్దార్ విశ్వనాథరావును వివరణ కోరగా సిబ్బంది పొరబాటు వల్ల డిలీటెడ్‌గా వచ్చింది. ఆమె ఓటును పునరుద్ధరి స్తామని తెలిపారు. జీరో డోర్ నెంబర్లతో ఓట్ల నమోదును కూడా పరిశీలిస్తామన్నారు.
Updated Date - 2023-08-22T00:48:16+05:30 IST