వంటా వార్పూ.. రాత్రి నిద్ర ఇక్కడే..
ABN, First Publish Date - 2023-10-11T00:21:16+05:30
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వెలుగు వీవోఏ, మెప్మా ఆర్పీలు కదం తొక్కారు.
ఏలూరు కలెక్టరేట్, అక్టోబరు 10 : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వెలుగు వీవోఏ, మెప్మా ఆర్పీలు కదం తొక్కారు. వెలుగు వీవోఏల ఉద్యోగుల సంఘం (సీఐటీయూ), మెప్మా ఆర్పీల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద మంగళవారం 36 గంటల ధర్నా, వంట వార్పుతో నిరసన తెలిపారు. జిల్లా నుంచి వీవోఏలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ధర్నా అనంతం వంటా వార్పు, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అక్కడే చేశారు. రాత్రి కలెక్టరేట్ వద్దే ఆరుబయట నిద్రించారు. మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, గ్రేడింగ్ పద్ధతి వెనక్కు తీసుకో వాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సీహెచ్.నాగలక్ష్మి అధ్యక్షత వహించారు. వీవోఏ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి షేక్ సుభాషిణి, కె.విజయలక్ష్మి, ఎం.ఆమని, మేరీ, కృష్ణకుమారి, కృష్ణవేణి, నాయకత్వం వహించారు.
Updated Date - 2023-10-11T00:21:16+05:30 IST