ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గొల్లలకోడేరు ఉప సర్పంచ్‌ సస్పెన్షన్‌

ABN, First Publish Date - 2023-09-23T00:24:38+05:30

గొల్లలకోడేరు గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఉపసర్పంచ్‌ కలిదిండి శ్రీనివాసవర్మను మూడు నెలలు పాటు సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ప్రశాంతి ఉత్తర్వులు జారీ చేసినట్లు మండల పరిషత్‌ అధికారులు తెలిపారు.

పాలకోడేరు, సెప్టెంబరు 22 : గొల్లలకోడేరు గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఉపసర్పంచ్‌ కలిదిండి శ్రీనివాసవర్మను మూడు నెలలు పాటు సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ప్రశాంతి ఉత్తర్వులు జారీ చేసినట్లు మండల పరిషత్‌ అధికారులు తెలిపారు. పంచాయతీ కొత్త పాలకవర్గం ఏర్పడక ముందు పంచాయతీలో సుమారు 90 లక్షల రూపాయలు నిధులు ఉండేవి. పాలకవర్గం ఏర్పడిన తర్వాత ఈ నిధుల వినియోగంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ గ్రామ పదో వార్డు సభ్యుడు కుక్కల బాబూరావు గతేడాది సెప్టెంబరులో సర్పంచ్‌ కుక్కల లక్ష్మీ, ఉపసర్పంచ్‌ కలిదిండి శ్రీనివాస్‌వర్మ, పూర్వపు పంచాయతీ కార్యదర్శి నాగేంద్రకుమార్‌లపై స్పందనలో పిర్యాదు చేశారు. అప్పటి డీపీవో నాగలత, ఈవోపీఆర్డీ రెడ్డియ్యలు విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక అందించి షోకాజ్‌ నోటీసులు ఇప్పించారు. ఈ కారణం గానే ప్రస్తుత సర్పంచ్‌ కుక్కల లక్ష్మీ చెక్‌ పవర్‌ను కూడా అధికారులు రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ అవినీతి ఆరోపణల మీదే ఈనెల 20వ తేదీన కలెక్టర్‌ ప్రశాంతి ఉసర్పంచ్‌ శ్రీనివాసవర్మను సస్పెండ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-09-23T00:24:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising