ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేమన జయంతికి ఆరవల్లి ముస్తాబు

ABN, First Publish Date - 2023-01-18T00:15:03+05:30

అత్తిలి మండలం ఆరవల్లిలో ఎక్కడా లేని విధంగా యోగి వేమన జయంతి వేడుకలు నిర్వహిస్తుంటారు. ఆరవల్లి ప్రజలు ఆరాధ్యదైవంగా భావించే యోగి వేమన జయంతి సందర్భంగా ఏటా జనవరి 18న ఉత్సవాలు నిర్వహిస్తారు.

ముస్తాబైన ఆలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు ఉత్సవాలు

అత్తిలి, జనవరి 17: అత్తిలి మండలం ఆరవల్లిలో ఎక్కడా లేని విధంగా యోగి వేమన జయంతి వేడుకలు నిర్వహిస్తుంటారు. ఆరవల్లి ప్రజలు ఆరాధ్యదైవంగా భావించే యోగి వేమన జయంతి సందర్భంగా ఏటా జనవరి 18న ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు సంబంధించి స్థానిక పెద్దలు ఒక కథనం చెబుతారు. 1926 ముందుగా ఆరవల్లి మ్రంలో ప్రతీ ఏటా అగ్నిప్రమాదాలు సంబవించేవని అటువంటి పరిస్థితుల్లో గ్రామానికి చెందిన సత్యనారాయణరెడ్డి 1926 జనవరి 18న గ్రామంలో వేమన చిత్రప్రటాన్ని తాటాకు పందిర్లులో ఉంచి పూజలు చేయడం ప్రారంభించారు. ఇలా చేయడం ప్రారంభించాక గ్రామంలో అగ్ని ప్రమాదాలు తగ్గిపోయాని అప్పటి నుంచి వేమన జయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారని చెబుతున్నారు. సంక్రాంతి పండుగ వెళ్లిపోయినా ఇక్కడ సందడి కొనసాగుతూనే ఉంటుంది. ఆరవల్లి ప్రజలకు వేమన జయంతి పెద్ద పండుగ. దేశ విదేశాల్లో ఉన్నవారంతా వేమన జయంతి ఉత్సవాలకు వస్తారు. 1984లో వేమన ఆలయం నిర్మించారు. ప్రతీ రోజూ ప్రత్యేక పూజలు చేస్తారు వేమన జయంతి రోజు సునకాలకు ప్రత్యేకంగా కాల భైరవ సంతర్పన నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా 18న పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ముగ్గులు, వాలీబాల్‌ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తారు. ఈ బహుమతి ప్రదానోత్సవానికి పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ మంత్రి కాకాని గోవర్ధనం, మాజీ మంత్రి కొడాలి నాని తదితరులు పాల్గొం టారని ఆలయ కమిటీ చైర్మన్‌ వెలగల అమ్మిరెడ్డి తెలిపారు.

Updated Date - 2023-01-18T00:15:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising