ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంకెప్పుడు ?

ABN, First Publish Date - 2023-03-26T23:56:27+05:30

సుమారు 45 సంత్సరాలపాటు ప్రైవేట్‌ , ఎయిడెడ్‌ కళాశాలగా కొనసాగిన వీరవాసరం ఎడ్యుకేషనల్‌ కమిటీ (వీఈసీ) జూనియర్‌ కళాశాలకు విద్యా సంస్కరణలో భాగంగా ప్రభుత్వ కళాశాలగా మారే అవకాశం వచ్చింది.

వీరవాసరం జూనియర్‌ కాలేజీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలగా వీరవాసరం వీఈసీ

విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఉత్తర్వుల్లో జాప్యం

వచ్చే ఏడాది ప్రవేశాలపై ప్రభావం

పేరు మార్పులో యాజమాన్యం తిరకాసు

వీరవాసరం, మార్చి 26: సుమారు 45 సంత్సరాలపాటు ప్రైవేట్‌ , ఎయిడెడ్‌ కళాశాలగా కొనసాగిన వీరవాసరం ఎడ్యుకేషనల్‌ కమిటీ (వీఈసీ) జూనియర్‌ కళాశాలకు విద్యా సంస్కరణలో భాగంగా ప్రభుత్వ కళాశాలగా మారే అవకాశం వచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో మేరకు కళాశాల ఆస్తులు, సిబ్బందితో ప్రభుత్వానికి అప్పగించడం లేదా ఎయిడెడ్‌ సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్‌ చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఆప్షన్‌ ఇచ్చింది. ఈ మేరకు కళాశాల యాజమాన్యం సెప్టెంబరులోనే ఆస్తులు, సిబ్బందితో కళాశాలను ప్రభుత్వానికి అప్పగిస్తామంటూ ఆమోదం తెలియజేసింది. దీనిపై ప్రభుత్వ కళాశాలగా విఇసిని ప్రకటించే సమయంలో యాజమాన్యం కళాశాల పేరు మార్పుపై పెట్టిన తిరకాసుతో కళాశాల అటు ప్రైవేట్‌, ఎయిడెడ్‌ కాకుండా ఇటు ప్రభుత్వ కళాశాలగా కాకుండా త్రిశంకు స్వర్గంలో నిలిచింది. మరోపక్క ఈ విద్యా సంవత్సరం ముగియనుంది. ఈ కళాశాల పరిస్థితి వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాలపై ప్రభావం చూపనుందని విద్యావంతులు ఆందోళన చెందుచున్నారు. జీవో విడుదల, ఉత్తర్వుల అమలులో అధికారులు ఖచ్చితమైన ఆదేశాలతో చర్యలు తీసుకోవడంలో చేస్తున్న జాప్యం పేద, మద్యతరగతి విద్యార్ధులపై పడనుంది.

గ్రామీణ ప్రాంత విద్యాభివృద్ధి కోసం

గ్రామీణ ప్రాంత విధ్యాభివృద్ధి కోసం 1975 లోవీరవాసరం ఎడ్యుకేషనల్‌ కమిటీ (వీఈసీ) పేరుతో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేశారు. 1975–1983 వరకూ ఎంఆర్‌కె జడ్పీహైస్కూల్‌, డిగ్రీ కళాశాలలో కళాశాలను నిర్వహించగా 1978లో కమిటీ విజ్ఞప్తి మేరకు పీడబ్ల్యుడీకి చెందిన 1–52 ఎకరాల స్థలంలో కళాశాలను ఏర్పాటు చేసి బదలాయించారు. 1980 నుంచి అప్పటి శాసనసభ్యుడు వర్ధినీడి సత్యనారాయణకు అప్పగించడంతో నూతన కమిటీ ఏర్పాటై కళాశాల ప్రైవేట్‌ యాజమాన్యం అధీనంలో కొనసాగింది. కాగా 1981 నుంచే ఎయిడెడ్‌ కళశాలగా మారింది. 2021 విద్యా సంస్కరణలో ప్రభుత్వానికి అప్పగించే ప్రయత్నం సాగింది. అన్ని ఆమోదాలు లభించి వీఈసీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలగా మారే సమయంలో అప్పటి శాసనసబ్యుడు వరిఽ్ధనీడి సత్యనారాయణ పేరును వీఈసీకి ముందు చేర్చి కళాశాల పేరును మార్చాలని ప్రస్తుత యాజమాన్యం తిరకాసు పెట్టింది. ఈ నివేదిక కమిషనర్‌ వద్ద పెండింగ్‌లో ఉంది.

విద్యార్థుల్లో సందిగ్ధత..

ప్రభుత్వ విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలతో ముగియనుంది. అదేవిధంగా 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. పది విద్యార్ధులు తదుపరి విద్యకోసం కళాశాలను అన్వేషించే ప్రయత్నాలు మొదలవుతాయి. ఈ పరిస్థితులలో కళాశాల ప్రైవేటా లేక ప్రభుత్వమా అనే సందిగ్ధంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. ఈ అయోయం కారణంగానే 300 సీట్లు ఉన్న కళాశాలలో గత విద్యా సంవ త్సరం 50 మంది విద్యార్థులు కూడా చేరని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విద్యా సంవత్సరం (2023–2024)లో ఎంతమంది విద్యార్థులు చేరతారో సందేహమే. ఇప్పటికే ప్రవేశాలపై గ్రామాల్లోనూ, హైస్కూళ్ళల్లోనూ అవగాహన కల్పిస్తున్న సమయంలో తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

ఆరు మండలాలకు ఇదే ప్రభుత్వ కళాశాల

వీఈసీ జూనియర్‌ కళాశాల ప్రభుత్వ కళాశాలగా మారితే ఆరు మండలాలకు చెందిన గ్రామీణ విద్యార్థులకు అనువుగా ఉంటుంది. వీరవాసరం, పాలకోడేరు, పెనుమంట్ర, పాలకొల్లు నరసాపురం, మొగల్తూరు, మండలాలలో ఒక్క ప్రభు త్వ కళాశాల కూడా లేదు. కళాశాల యాజమాన్య తిరకాసుతో విద్యార్థుల పరిస్థితి డోలాయమానంగా మారింది. గత నవంబరులోనే డీవీఈవో, ఆర్జేడీ కళాశాలను సందర్శించి ప్రభుత్వ జీవోలో ఉన్న అంశాలను పరిశీలించి కమిషనర్‌కు నివేదిక ఇచ్చినా ఇంత వరకూ ఏ జడ్జిమెంటు లేక నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఆందోళనకు దిగేందుకు సిద్ధపడుతున్నారు.

Updated Date - 2023-03-26T23:56:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising