రైలు గేటును ఢీకొట్టిన వ్యాను
ABN, First Publish Date - 2023-08-02T00:50:52+05:30
కైకలూరు–ఆకివీడు రైలు మార్గంలో మండలంలోని ఆలపాడు రైల్వే గేటును బొలేరా వ్యాను ఢీకొట్టడంతో రైలు సుమారు 37 నిమిషాలు నిలిచిపోయింది.
అరగంట పైగా నిలిచిన గూడ్స్ రైలు
కైకలూరు, ఆగస్టు 1: కైకలూరు–ఆకివీడు రైలు మార్గంలో మండలంలోని ఆలపాడు రైల్వే గేటును బొలేరా వ్యాను ఢీకొట్టడంతో రైలు సుమారు 37 నిమిషాలు నిలిచిపోయింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఆకివీడు నుంచి కైకలూరు వైపు గూడ్సు రైలు వస్తుండటంతో గేట్‌మన్ గేటు వేశాడు. అయితే గేటు వేస్తుండటాన్ని గమనించిన కైకలూరు నుంచి ఆకివీడు వైపు వెళ్తున్న బొలేరో వ్యాను డ్రైవరు వేగంగా వచ్చి అప్పటికే పడిపోయిన గేటును వాహనంతో ఢీకొట్టాడు. దీంతో గేటు రెండు ముక్కలైంది. గేట్‌మన్ వాహనాల రాకపోకలు జరగకుండా ఏర్పాట్లు చేసి సిగ్నల్ ఇచ్చేందుకు సుమారు 37 నిమిషాలు పట్టింది. పామర్రు–దిగమర్రు జాతీయ రహదారిపై రైల్వేగేటుకు ఇరువైపులా వందలాది వాహనాలు బారులు తీరాయి. వ్యానును గేట్‌మన్ పక్కన ఆపి రైల్వే ఉన్నతాధికారు లకు సమాచారమిచ్చాడు.
Updated Date - 2023-08-02T00:50:52+05:30 IST