ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గొయ్యి తవ్వారు.. చెట్టు కూలింది!

ABN, First Publish Date - 2023-08-23T00:11:29+05:30

డ్రైయిన్ల కోసం తవ్విన గొయ్యి రోజుల తరబడి అలాగేం ఉంది. ఆ పక్కనే ఉన్న ఒక వేప చెట్టు మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా రోడ్డుపై పడిపోయింది.

విద్యుత్‌ తీగలపై పడిపోయిన చెట్టు

ఏలూరు అమీనాపేటలో విద్యుత్‌ తీగలపై పడిన చెట్టు

ఏలూరు క్రైం, ఆగస్టు 22 : డ్రైయిన్ల కోసం తవ్విన గొయ్యి రోజుల తరబడి అలాగేం ఉంది. ఆ పక్కనే ఉన్న ఒక వేప చెట్టు మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఏలూరు అమీనాపేట మీ సేవా కేంద్రం (ప్రస్తుత సచి వాలయం) ఎదురుగా డ్రైయిన్‌ నిర్మాణం కోసం వారం రోజుల క్రితం గొయ్యి తవ్వి వదిలేశారు. తవ్విన ప్రాంతం పక్కనే ఉన్న వేప చెట్టు వేర్లు తెగి పోవడంతో మంగళవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో అకస్మా త్తుగా విద్యుత్‌ తీగలపై పడిపోయింది. అక్కడే ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగి సరఫరా నిలిచిపోయింది. సాధారణంగా సాయంత్రం 4 గంటల నుం చి విద్యార్థులు ఆరోడ్డులో వెళతారు. స్కూలు బస్సులు కూడా వెళ్తుంటాయి. ట్రాఫిక్‌ ఎస్‌ఐ వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందితో ట్రాఫిక్‌ను క్రమ బద్దీకరించారు. ఎక్స్‌కవేటర్‌ తీసుకువచ్చి చెట్టును తొలగింపు పనులు చేపట్టారు. అమీనాపేట, అశోక్‌నగర్‌ ప్రాంతాలకు పూర్తిగా విద్యుత్‌ నిలిచిపోయింది. గంటల సమయం గడిచినా విద్యుత్‌శాఖకు సంబంధించిన సిబ్బంది రాలేదు. రాత్రి 9 గంటలకు చెట్టు కొమ్మలను తొలగించారు. 9.30 గంటలకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారు.

Updated Date - 2023-08-23T00:11:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising