ఆటోపై పడిన తాడిచెట్టు
ABN, First Publish Date - 2023-03-22T23:55:15+05:30
గాలివానకు తాడిచెట్టు ఆటోపై పడటంతో ముగ్గురు మహిళలు, ఒక చిన్నపాప గాయపడిన సంఘటన నూజివీడు మండలం మర్రి బంధం వద్ద బుధవారం చోటుచేసుకుంది.
నూజివీడు మండం మర్రిబంధం వద్ద తాడిచెట్టు పడడంతో ధ్వంసమైన ఆటో
నూజివీడు టౌన్, మార్చి 22: గాలివానకు తాడిచెట్టు ఆటోపై పడటంతో ముగ్గురు మహిళలు, ఒక చిన్నపాప గాయపడిన సంఘటన నూజివీడు మండలం మర్రి బంధం వద్ద బుధవారం చోటుచేసుకుంది. మర్రిబంధం నుంచి నూజివీడు వైపు వెళుతున్న ఆటో పై బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన వర్షానికి తాడి చెట్టు ఆటోపై పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న సిద్దార్ధ నగర్‌కు చెందిన ముగ్గురు మహిళలు, ఒక పాపకు గాయాలవగా 108లో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సీతారాంపురంలో ఒక శుభకార్యానికి హాజరై సిద్దార్ధ నగర్‌కు తిరిగి వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
Updated Date - 2023-03-22T23:55:15+05:30 IST