ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి జాతీయస్థాయి నాటికల పోటీలు

ABN, First Publish Date - 2023-04-16T00:30:10+05:30

పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వరస్వామి ఆలయం ఎదురుగా కళారంజని నాటక అకాడమీ 12వ వార్షికోత్సవంలో భాగంగా ఈనెల 16 నుంచి 18వ తేది వరకు జాతీయ స్థాయి తెలుగు నాటికల పోటీలు నిర్వహిస్తున్నామని అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు వ్వాది దాశరధి శ్రీనివాసరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి) : పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వరస్వామి ఆలయం ఎదురుగా కళారంజని నాటక అకాడమీ 12వ వార్షికోత్సవంలో భాగంగా ఈనెల 16 నుంచి 18వ తేది వరకు జాతీయ స్థాయి తెలుగు నాటికల పోటీలు నిర్వహిస్తున్నామని అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు వ్వాది దాశరధి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం సంబంధిత బ్రోచర్లు ఆవిష్కరించి ఆయన మాట్లాడుతూ ప్రారంభం సభకు విశిష్ట అతిథులుగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు పాల్గొంటారన్నారు. నాటిక పోటీలను చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్‌ అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్‌ ప్రారంభిస్తారన్నారు. రాత్రి 8 గంటలకు హేలాపురి కల్చరల్‌ అసోసియేషన్‌ (ఏలూరు) వారిచే మనసున మనసై నాటిక, 9.30కు కళాంజలి హైదరాబాదు వారిచే మనిషి మంచోడే నాటికలు జరుగుతాయన్నారు. గౌరవాధ్యక్షుడు చుక్కనశ్రీ, కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్‌ వై.వెంకట రమణ, ప్రధాన కార్యదర్శి మెంటే పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షుడు ఛానాబాషా, ఎస్వీవీప్రసాద్‌, ఎం.శ్రీనివాస్‌, ఎం.ఎస్‌. ప్రసాద్‌, ఎస్‌. నరేష్‌ నాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-16T00:30:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising