నేడే శ్రీ జలదుర్గా గోకర్ణేశ్వరస్వామి కల్యాణం
ABN, First Publish Date - 2023-03-02T23:58:50+05:30
కొల్లేటికోట శ్రీ పెద్దింటమ్మ (జలదుర్గ) కల్యాణ మహోత్సవాలను శుక్రవారం నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జలదుర్గ అమ్మ వారికి కొల్లేటికోటకు రెండు కిలోమీటర్ల దూరంలోని గోకర్ణపురంలోని శ్రీ గోకర్ణేశ్వరస్వామికి కల్యాణం నిర్వహి స్తారు.
కైకలూరు, మార్చి 2 : కొల్లేటికోట శ్రీ పెద్దింటమ్మ (జలదుర్గ) కల్యాణ మహోత్సవాలను శుక్రవారం నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జలదుర్గ అమ్మ వారికి కొల్లేటికోటకు రెండు కిలోమీటర్ల దూరంలోని గోకర్ణపురంలోని శ్రీ గోకర్ణేశ్వరస్వామికి కల్యాణం నిర్వహి స్తారు. అక్కడి నుంచి పల్లకిలో భక్తుల కోలాహలం, మేళతాళాల మధ్య స్వామిని ఊరేగింపుగా కొల్లేటికోటకు తీసుకువచ్చి మండపంలో స్వామి వారికి అమ్మవారికి రాత్రి 12 గంటల సమయంలో కల్యాణం నిర్వహిస్తారు. తొలుత అమ్మవారికి కలువబోనాల గ్రామోత్సవం జరు పుతారు. పందిరిపల్లిగూడెం గ్రామస్తులు భారీ ప్రభతో అమ్మవారి దేవస్థానానికి వేలాది మంది భక్తుల మధ్య చేరుకుంటారు. కొల్లేటికోటలో పెద్దింటి అమ్మ వారిని పెండ్లి కుమార్తెగా గోకర్ణపురంలో గోకర్ణేశ్వరస్వామిని పెండ్లి కుమారుడిగా గురువారం ముస్తాబు చేశారు. ఈ కల్యాణ మహోత్సవానికి ఆలయాన్ని విద్యుద్దీపాలు, పచ్చని తోరణాలతో అలంకరించారు. జాతరకు ఆలయ ఈవో కేవీ గోపాలరావు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తుల సౌకర్యార్థం జల్లు స్నానాలు, కేశ ఖండనశాల, మంచి నీరు, పారిశుధ్యం, చలువ పందిళ్లు, విద్యుద్దీపాలంకరణ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు. అమ్మవారి కల్యాణమహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంభ్రాలను ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అందజేస్తారు.
Updated Date - 2023-03-02T23:58:50+05:30 IST