ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జయహో చంద్రన్న

ABN, First Publish Date - 2023-10-02T00:37:01+05:30

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై పార్టీ శ్రేణులు కదంతొక్కాయి. పోలీసుల ఆంక్షలను ఛేదించాయి. పదండి తోసుకు... పదండి ముందుకు అంటూ తాడేపల్లిగూడెం ప్రధాన రహదారిపై వేలాదిమంది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మహా పాదయాత్రకు తరలి వచ్చారు.

తాడేపల్లిగూడెం మహాపాదయాత్రలో పాల్గొన్న టీడీపీ నాయకులు

తాడేపల్లిగూడెంలో మహా పాదయాత్ర

కదంతొక్కిన పార్టీ శ్రేణులు.. నినాదాల హోరు..

పోలీసుల ఆంక్షలు బేఖాతర్‌

అవరోధాలు సృష్టించినా అడుగు ముందుకే

మూడు కిలోమీటర్లు.. వేలాదిమంది కార్యకర్తలు

‘సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి’ అంటూ నినాదాలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై పార్టీ శ్రేణులు కదంతొక్కాయి. పోలీసుల ఆంక్షలను ఛేదించాయి. పదండి తోసుకు... పదండి ముందుకు అంటూ తాడేపల్లిగూడెం ప్రధాన రహదారిపై వేలాదిమంది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మహా పాదయాత్రకు తరలి వచ్చారు. మార్కెట్‌ రహదారి అంతా పసుపుమయమైంది. పసుపు జెండాలతో రెపరెపలా డింది. సైకో పోవాలి–సైకిల్‌ రావాలి అన్న నినాదాలు దారి పొడవునా హోరెత్తాయి. కొంతమంది పార్టీ శ్రేణులు నల్లజెండాలను ప్రదర్శించారు.

భీమవరం/తాడేపల్లిగూడెం అర్బన్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) :

ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని 15 నియోజకవర్గాల నుంచి వేలాదిమంది కార్యకర్తలు పాదయాత్రకు తరలివచ్చారు. ఎక్కడికక్కడ పోలీసులు కట్టడి చేశారు. తాడేపల్లిగూడెం చేరకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇవేమీ కార్యకర్తలను అడ్డుకోలేకపోయాయి. జిల్లాలోని పలువురు ముఖ్య నాయకులు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలు తరలి వచ్చి పాదయాత్రను దిగ్విజయం చేశారు. తాడేపల్లిగూడెంలోని గొర్రెల సూరన్న కాంప్లెక్స్‌ నుంచి పాదయాత్ర ను ప్రారంభించారు. ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు వలవల బాబ్జి, మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఘంటా మురళి, బూరుగుపల్లి శేషారావు, మాజీ ఎంపీ మాగంటిబాబు, మాజీ మంత్రి జవహర్‌, బొరగం శ్రీనివాస్‌, మద్దిపాటి వెంకట్రాజు తదితర నాయకులు పాల్గొన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు యాత్ర ప్రారంభమైంది. అరకిలోమీటరు వరకు పాదయాత్ర సాఫీగా సాగింది. పాదయాత్ర ముందుకు సాగకుండా పోలీసులు అడ్డు తగిలారు. ఒకవైపు పోలీసులు అడ్డు తగలడం.. మరోవైపు కార ్యకర్తలు ముందుకు ఉరికే ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగింది. పది నిమిషాలు పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురు, నాయకులు కార్యకర్తలను పోలీసులు కుళ్లపొడిచారు. అయినా ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. చివరకు తెలుగుదేశం శ్రేణులదే పైచేయి అయింది. పోలీసులు పక్కకు తప్పుకున్నారు. కార్యకర్తలు తోసుకుంటూ పాదయాత్రను కొనసాగించారు. అనంతరం నరసాపురం డీఎస్పీ పాదయాత్రకు అడ్డుతగిలారు. ముందుకు కదలకూడదంటూ హుకుం జారీచేశారు. కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ముందుకు ఉరికారు. దీంతో డీఎస్పీ కిందపడిపోయారు. ఆయనపై ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని, మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి పడిపోయారు. దీంతో డీఎస్పీని అంతా లేవనెత్తారు. పోలీస్‌ ఐలాండ్‌– తాలూక ఆఫీస్‌ సెంటర్‌ మీదుగా హౌసింగ్‌ బోర్డు కాలనీ వద్ద ఎస్‌వీ రంగారావు సర్కిల్‌ వరకు పాదయాత్ర నిర్వహించారు. దారిపొడవునా చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. కాబోయే సీఎం చంద్రబాబు అంటూ ఎలుగెత్తి చాటారు. ఎస్‌వీఆర్‌ సర్కిల్‌ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. గన్నితోపాటు, ఇతర నాయకులు మాట్లాడారు. పోలీసుల తీరును, వైసీపీ కుట్ర పూరిత చర్యలను ఎండగట్టారు.

పశ్చిమపై పోలీస్‌ వల

తాడేపల్లిగూడెంలో పాదయాత్ర నిర్వహిస్తుండడంతో పోలీసుల కన్ను పశ్చిమ గోదావరిపై పడింది. పాదయాత్ర నిర్వహించకుండా ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. తాడేపల్లిగూడెం పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు. జిల్లాలో ముఖ్య నాయకులందరికీ ముందస్తు నోటీసులు అందజేశారు. వాస్తవానికి తెలుగుదేశం జిల్లాలో పాదయాత్రకు అనుమతి కోరింది. జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. అనుమతి మంజూరు చేయలేదు. ఇతర జిల్లాల మాదిరిగానే ఇక్కడ కూడా అనుమతి ఇస్తారని టీడీపీ నాయకులు భావించారు. ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని 15 నియోజకవర్గాల ఇన్‌చార్జిలు సమావేశమై పాదయాత్రను విజయవంతం చేయాలని రెండు రోజుల ముందుగానే ప్రణాలిక చేసుకున్నారు. తీరా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పాదయాత్రకు వెళ్లకూడదంటూ అన్ని నియోజకవర్గాల్లోని ముఖ్య నాయకులకు నోటీసులు జారీచేశారు. గృహ నిర్బంధం చేశారు. నరసాపురంలో దీక్ష శిబిరాన్ని సందర్శిస్తున్న పితాని సత్యనారాయ ణకు అక్కడ నోటీసులు అందించారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర్‌ రామ్మోహనరావు, ఉండి ఎమ్మెల్యే రామరాజుకు నోటీసులి చ్చారు. జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మికి నోటీసులు ఇచ్చి హౌస్‌ అరెస్ట్‌ చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జిని అదుపులోకి తీసుకోవడానికి ఆదివారం ఉదయం నుంచే పోలీసులు ప్రయత్నం చేశారు. బాబ్జి ఇంటికి పోలీసులు వెళ్లారు. హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నట్టు కానిస్టేబుళ్లు నోటీసులు అందించారు. నోటీసులు అందుకోకుండా ఆయన బయటకు వచ్చేశారు. గణేష్‌ నగర్‌లోని మొక్కరాల గ్రీన్‌ మెడోస్‌లోని గంధం సతీష్‌ ఇంట్లో బాబ్జి ఉన్నారని అధిక సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. గస్తీ పెంచారు. అక్కడ నుంచి బాబ్జి తప్పుకున్నారు. మరో ఇంటికి మారారు. పోలీసులు మాత్రం గ్రీన్‌ మెడోస్‌ వద్ద సాయంత్రం వరకు గస్తీ ఉన్నారు. వారి ప్రయత్నం వృథా అయింది. వేరే చోటకు తరలివెళ్లిన బాబ్జి పాదయాత్ర ప్రారంభ సమయానికి గొర్రెల సూరన్న కాంప్లెక్స్‌వద్దకు చేరుకున్నారు. అప్పటికే వేలాదిగా నాయకులు, కార్యకర్తలు కాంప్లెక్స్‌ వద్దకు చేరుకున్నారు. పాదయాత్ర ప్రారంభం కాగానే బాబ్జిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు విశ్వప్రయత్నమే చేశారు. పోలీసులకు, కార్యకర్తలకు వాగ్వాదం. తోపులాట జరిగిన క్రమంలో బాబ్జిని పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనంలోకి ఎక్కించారు. గుండె నొప్పి వస్తుందంటూ బాబ్జి చెప్పడంతో ఆయనను ఏరియా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఎస్‌వీఆర్‌ సర్కిల్‌ వద్దకు వాహనం చేరుకుంది. అప్పటికే ట్రాఫిక్‌ పెరగడంతో పోలీస్‌ వాహనం ఆగిపోయింది. దాని నుంచి బాబ్జి దిగి వెళ్లి బహిరంగ సభలో పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలి వచ్చి పాదయా త్రను విజయవంతం చేశారు.

సడలని సంకల్పం

చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా కొనసాగిన నిరసనలు

(భీమవరం–ఆంధ్రజ్యోతి) : సంకల్పం అదే. చంద్రబాబు బయటకు రావాలి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం పతనం కావాలి. అప్పటిదాకా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి అంటూ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు దీక్ష బూనారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆదివారం కూదా జిల్లాలో నిరసనలు కొనసాగాయి. ఆచంట, పాలకొల్లు, నర్సాపురంలో చేపట్టిన దీక్షకు మాజీమంత్రి పితాని సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని పితాని స్పష్టం చేశారు. పాలకొల్లులో విశ్వబ్రాహ్మణులు దీక్షలో కూర్చున్నారు. ఎమ్మెల్యే రామానాయుడు దీక్షకు మద్దతు తెలిపారు. భీమవరంలో నిర్వహించిన దీక్షకు మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చున్నారు. ఉండిలో టీడీపీ పాలకోడేరు మండల నాయకులు దీక్ష వహించారు. పాలకోడేరు మండల అధ్యక్షుడు దెందుకూరి ఠాగూర్‌ కోటేశ్వరరావు, నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు దొంగ కృష్ణ తదిరులు దీక్షలో కూర్చున్నారు. ఆచంటలో తెలుగుదేశం, జనసేన నాయకులు నిరసన తెలిపారు. పితాని వెంకట్‌ కరపత్రాలను పంపిణీ చేశారు. తాడేపల్లిగూడెంలోనూ రూరల్‌, పెంటపాడు మండల నాయకులు దీక్ష వహించారు. తణుకు దీక్షలో దొమ్మేటి సుధాకర్‌, కలగర వెంకటకృష్ణ, పసల రామకృష్ణ పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్చి ఆరిమిల్లి రాధాకృష్ణ, తూర్పుకాపులు మద్దతు తెలిపారు.

Updated Date - 2023-10-02T00:37:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising