బెంగళూరు అపార్ట్‌మెంట్ అవినీతి తేలుద్దాం
ABN, First Publish Date - 2023-08-06T01:05:38+05:30
ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించాలి. చెత్తపై పన్నువేసిన చెత్త ప్రభుత్వం. అభివృద్ధి లేదు. పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించండి. రానున్న ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టి చంద్రబాబును సీఎం చేయండి’ అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్య న్నపాత్రుడు పిలుపునిచ్చారు.
చర్చకు సిద్ధమా.. మంత్రి కారుమూరికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు సవాల్
వచ్చే ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టి చంద్రబాబును సీఎం చేయాలి
వేల్పూరులో ఆరిమిల్లి సకల జనుల దీక్ష
తణుకు, ఆగస్టు 5 : ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించాలి. చెత్తపై పన్నువేసిన చెత్త ప్రభుత్వం. అభివృద్ధి లేదు. పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించండి. రానున్న ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టి చంద్రబాబును సీఎం చేయండి’ అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్య న్నపాత్రుడు పిలుపునిచ్చారు. తణుకు మండలం వేల్పూరులో మంత్రి కారుమూరి బీసీల మధ్య కుల వైషమ్యాలు సృష్టించి నందుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వ ర్యంలో సకల జనుల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అయ్య న్నపాత్రుడు మాట్లాడుతూ ‘పంచాయతీరాజ్ వ్యవస్థకు చట్టం ఉంది. గ్రామంలో ఏదైనా పనిచేయాలంటే పంచాయతీలో తీర్మానం చేయాలి. అంచనాలు రూపొందించాలి. కాని, తీర్మా నాలు చేయకుండా ఏ అధికారంతో వేల్పూరులో పనులు చేయించారు ?’ అని మంత్రిని నిలదీశారు. నాలుగున్నరేళ్ల జగన్‌పాలనలో అరాచకం రాజ్యమేలుతుందని విమర్శించారు. 16 నెలలు జైల్లో చిప్ప కూడు తిన్న నువ్వు కర్మ కొద్దీ సీఎంవు అయ్యావన్నారు. మీ మంత్రి ఉన్నాడు. దున్నపోతుకు ఓట్లు వేసి గెలిపించారు. సివిల్ సప్లయిస్‌లో ఎన్ని విభాగాలు ఉన్నా యో చెప్పనండి. వ్యాన్‌లపై వచ్చి బియ్యం కేజికి ఇస్తున్నారా ? ఆరు నెలల నుంచి రాష్ట్రప్రభుత్వం ఇచ్చే బియ్యం ఇవ్వడం లేదు. ఆ బియ్యం కాకినాడ నుంచి విదేశాలకు పోతున్నాయి. దానికి మంత్రి యాక్షన్ తీసుకోవాల్సి ఉందా ? లేదా ? టమా టా ధరలు పెరిగితే ధరలు తగ్గించాలి కదా. మీ నియోజక వర్గం పరువు మొత్తం తీసేశారు. టీడీఆర్ బాండుల ద్వారా రూ.800 కోట్లు కుంభకోణం. డబ్బులు ఇవ్వకుండా బాండ్లు ఇస్తానని చెబితే ప్రజలు నమ్మారు. పలితంగా ఎస్సీ కమిషనర్ సస్పెండయ్యారు. బెంగళూరు అపార్టుమెంట్ల కుంభకోణం నాకు తెలుసు. ఎర్రిపప్ప బెంగళూరు అపార్టుమెంటులో ఎంత అవినీతి ఉందో తేల్చుకుందాం. చర్చకు సిద్ధమా’ అంటూ మంత్రి కారుమూరికి సవాల్ చేశారు. ఆరిమిల్లిని ఎమ్మెల్యేగా గెలుపుంచుకోవాలని కోరారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ‘ఇప్పుడు మనమంతా అప్రజాస్వామిక పాలనలో ఉన్నాం. త్వరలోనే జగన్‌ను ఓడించి, చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు జనం సిద్ధంగా వున్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పద్ధతి మార్చుకోవాలి. బూతులు తిట్టడం సరికాదు. ప్రజా సంప్రదాయాలను పాటించాలి. పవన్ వస్తే కలవడానికి సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు.
మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ మాట్లాడుతూ సర్పంచ్‌లకు, పంచాయతీ కార్యవర్గాలకు వున్న అధికారాలను కాలరాసే చర్యలు సరికాదన్నారు. పంచాయతీ నిధులు ఖర్చు పెట్టే విషయంలో మంత్రి కారుమూరి జోక్యం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ధాన్యం తడిసిపోయి రైతులు కష్టాల్లో ఉన్నపుడు చంద్రబాబు పర్యటించి ధైర్యం చెప్పారన్నారు. చంద్రబాబు సీఎం అయితేనే న్యాయం జరుగుతుందన్నారు.
మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి మాట్లాడుతూ ‘వేల్పూరులో గత పంచాయతీ ఎన్నికల ముందు ప్రత్యేకాధికారి పాలనలో నిబంధన లకు విరుద్ధంగా బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి ఆర్థిక సంఘం నిధులు కోటి 50 లక్షలు మంజూరు చేయించి, పనులు చేయకపోయినా, ఎం బుక్‌లు రికార్డు చేయించారు. దీనిపై ఫిబ్రవరిలో కొత్త పంచాయతీ పాలక వర్గం వచ్చిన తర్వాత నిధులకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది. దీంతో మంత్రి కారుమూరి బీసీల మధ్య చిచ్చు పెట్టాలని చూశారు. అనేకసార్లు చర్చించి గ్రామంలో ఏ వర్గానికి ఆరిమిల్లి కుటుంబం అన్యాయం చేయలేదు. సంఘాలు వారు మా దగ్గరకు రావడంతో కోర్టులో కేసులు పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పాం. ఇందులో భాగంగా జూన్ 4న కోర్టులో పిటిషన్ వేశారు. ఇది తెలిసి వైసీపీ నాయకులు మంత్రి కారుమూరి దీక్షలు చేయించారు. మరీ ఇంత చిల్లరగా వ్యవహరిస్తారనుకోలేదు. వారంతా సైకోలు మాదిరిగా ఉన్నారు’ అని తీవ్రంగా విమర్శించారు. సర్పంచ్ విశ్వనాదం కృష్ణవేణి మాట్లాడుతూ దీక్షకు మద్దతు తెలిపిన అందరికి అభినందనలు తెలిపారు.
దీక్షకు మద్దతు
ఆరిమిల్లికి డా.దొమ్మేటి పూల మాలలు వేసి దీక్షను ప్రారం భించారు. దీక్షలో ఆర్య వైశ్య, విశ్వబ్రాహ్మణ, శెట్టి బలిజ, అగ్ని కుల క్షత్రియ, కాపు, ఎస్సీ, కరికాల దేవాంగుల, కర్ణభక్తుల, పద్మశాలి, రజక, నాయీ బ్రాహ్మణ, దేవతిలకుల సంఘాల నాయకులు దీక్షలో పాల్గొన్నారు. వివిధ వర్గాల ప్రజలు సంఘీ భావం తెలిపారు. సాయంత్రం అయ్యన్న పాత్రుడు ఆరిమిల్లికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
Updated Date - 2023-08-06T01:05:38+05:30 IST