ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో రైతులకు అన్యాయం

ABN, First Publish Date - 2023-06-07T00:03:07+05:30

వైసీపీ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరావు విమర్శించారు.

తిరుమలదేవి పేటలో చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం

టి.నరసాపురం, జూన్‌ 6: వైసీపీ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరావు విమర్శించారు. మహానాడులో ప్రకటించిన టీడీపీ మేనిపేస్టోకు మద్దతుగా తిరుమలదేవి పేటలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మహిళలు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మంగళవారం పాలభిషేకం చేశారు. శీలం వెంకటేశ్వరావు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగిందన్నారు. మహానాడులో చంద్రబాబు ప్రకటించిన మేని ఫెస్టోతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. జగన్‌ ప్రభుత్వం నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేశారని, కొంతమందికి డబ్బులు వేసి పెంచిన ధరలతో మళ్లీ లాగేస్తున్నారని విమర్శించారు. టీడీపీ తోనే మహిళా సాధికారత సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలని కోరారు. వాసిరెడ్డి మోహన్‌రావు, సం దేపూడి ప్రభాకర్‌ సాయి, కలిశెట్టి పార్థసారథి, గండబోయిన శ్రీను, కాల్నీడి రాంబాబు, భద్రం, యాగంటి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

దళిత మహిళలపై వైసీపీ దాడులు అన్యాయం

చింతలపూడి, జూన్‌ 6: రాష్ట్రంలో దళిత మహిళలపై అఘాయిత్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని, రక్షణ కల్పించాల్సిన అధికార పార్టీ నేతలే దళిత స్త్రీలను హత్య చేయడం అమానుషమని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదుల చేశారు. ప్రకాశం జిల్లా రావివారిపాలెంలో దళిత మహిళ హనుమాయమ్మను వైసీపీ నాయకుడు ట్రాక్టర్‌తో తొక్కించి చంపడం దారుణమన్నారు. గతంలో గుం టూరు జిల్లా శివపురం తండాకు చెందిన గిరిజన మహిళ మంత్రుబాయిని శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్‌తో తొక్కించి దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని, ఆ నాయకులకు దళిత మహిళ అంటే ఎటువంటి భావన ఉందో ఈ సంఘటనతో బహిర్గతమవుతుందన్నారు. జగన్మోహన్‌ రెడ్డికి దళితులంటే చిన్నచూపు అని, అందుకే వైసీపీ చిల్లర గ్యాంగ్‌ దళిత మహిళలపై దాడులు చేస్తూ పేట్రేగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హనుమాయమ్మ హత్యకు కారకులైన కొండలరావుపై చర్య లు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలిలో దళితుల లంక భూములను వైసీపీ ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం అన్యాయమని, దళితులకు అండగా నిలిచిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును అరెస్టు చేయ డం దారుణమని పీతల సుజాత అన్నారు సెంటు పట్టా పేరుతో ఇప్పటికే 12 వేల ఎకరాల దళితుల అసైన్డ్‌ భూములు లాక్కున్నప్పటికీ దాహం తీరలేదని, లంక భూములపై వైసీపీ నేతల కళ్ళుపడ్డాయన్నారు.

Updated Date - 2023-06-07T00:03:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising