ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నవరత్నాలు అని రాష్ట్ర ప్రజలను మోసగించారు

ABN, First Publish Date - 2023-07-21T23:52:23+05:30

నవరత్నాలు పేరుతో రాష్ట్ర ప్రజలను జగన్‌ మోసగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ విమర్శించారు.

టీడీపీలో చేరిన వారితో మాగంటి, చింతమనేని, బొరగం, నేతలు

టి.నరసాపురం, జూలై 21: నవరత్నాలు పేరుతో రాష్ట్ర ప్రజలను జగన్‌ మోసగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ విమర్శించారు. తిరుమలదేవిపేటలో శుక్రవారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ బహిరంగ సభలో చింతమనేని, మాజీ ఎంపీ మాగంటి బాబు, పోలవరం నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ మాట్లాడారు. జగన్మోహన్‌ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారని, ఏ ఒక్క ఆసుపత్రిలో పేదలకు వైద్య సేవలు అందట్లేదని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని మండిపడ్డారు. అమ్మఒడి ఇంటికి ఒక్కరికే ఇస్తున్నారని, మిగిలిన చిన్నారులు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇంట్లో పిల్లలందరికీ ఇస్తామన్నారు. తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన సుమారు 200 మంది టీడీపీలో చేరారు. వారికి నాయకులు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరావు, కోళ్ల నాగేశ్వరరావు, పారేపల్లి రామారావు, ఆచంట సూర్యనారాయణ, పిన్నమనేని మధు, తోట లక్ష్మీనారాయణ, వాసిరెడ్డి మోహన్‌, గన్నిన సురేంద్రచౌదరి, వడ్డీ శ్రీనివాస రావు, చిట్టి బొమ్మ వీరబాబు, సందెపూడి సాయి, తదితరులు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి

జంగారెడ్డిగూడెం టౌన్‌: ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలని టీడీపీ చింతలపూడి నియోజకవర్గ పరిశీలకుడు కోళ్ల నాగేశ్వరరా వు సూచించారు. గుర్వాయిగూడెంలో మండల అధ్యక్షుడు సాయిల సత్యనా రాయణ అధ్యక్షతన శుక్రవారం పార్టీ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నాగేశ్వరరావు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో బీ ఎల్‌వోలు ఓటర్ల పరిశీలన చేస్తారన్నారు. ప్రతీ గ్రామంలో క్లస్టర్‌ ఇన్‌చార్జిలు, యూనిట్‌ ఇన్‌చార్జిలు, కొత్త ఓటర్లను చేర్పించడం, డబుల్‌ ఎంట్రీ, దొంగ ఓట్లను తొలగించడం చెయ్యాలన్నారు. సాయిల సత్యనారాయణ మాట్లాడు తూ ఒకే డోర్‌ నెంబర్‌పై ఎక్కువగా ఓట్లు నమోదు చేసినా, టీడీపీ వాళ్ల ఓట్లు తొలగించినా బీఎల్‌వోలకు ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో కుక్కల మాధవరావు, ఎలికే ప్రసాద్‌, గోలి అనిల్‌, పొన్నగంటి అనిల్‌, క్లస్టర్‌ ఇన్‌చార్జి దాసరి అప్పారావు, శీలం రామచంద్రరావు, జొన్నకూటి శ్రీను, తానిగడప నరేష్‌, అద్దేపల్లి రవి, కొడవటి వెంకటేశ్వరరావు, కొనకళ్ళ శ్రీను, సింహాద్రి రవి, గద్దె బాబీ, గోలి వెంకటరెడ్డి, చిటికెన శ్రీను, తడికమల్ల గోపాల్‌, గంటా రామారావు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T23:52:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising