ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సడలని పోరు

ABN, First Publish Date - 2023-09-23T00:15:23+05:30

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణుల పోరు కొనసాగుతోంది.

జంగారెడ్డిగూడెంలో టీడీపీ నేతల కొవ్వొత్తుల ర్యాలీ

జంగారెడ్డిగూడెం, సెప్టెంబరు 22: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణుల పోరు కొనసాగుతోంది. జంగారెడ్డిగూడెంలో శుక్రవారం నిరస న దీక్షలు హోరెత్తాయి. ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద, మండలంలోని గుర్వాయి గూడెం గ్రామాల్లో శిబిరాల్లో దీక్షలు చేపట్టారు. గుర్వాయిగూడెంలో టీడీపీ మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు నత్త నాగేంద్ర ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. సాయంత్రం మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. గోలి అనిల్‌, లాగు సురేష్‌, చేను ప్రసాద్‌, బాదరాల వీర బాబు, కోండ్రు నాగరాజు, రాగాని వంశీ, తెల్లగొర్ల అంజి, సుమంత్‌ చౌదరి, చిటికిన సురేష్‌, తానిగడప శేషు, కొలుకులురి ప్రసాద్‌, మురళీ, సాయి, త్రిమూర్తులు, కోనేటి చంటి, గెడ సబ్బు తదితరులు దీక్ష చేపట్టారు.

పట్టణంలో శుక్రవారం రాత్రి కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. రామచంద్రపురం వాటర్‌ ట్యాంక్‌ నుంచి కొత్తబస్టాండ్‌ మీదుగా గంగానమ్మ గుడి వరకు కొవ్వొత్తులను చేతపట్టి మహిళలు, చిన్నపిల్లలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా ప్రదర్శన చేశారు. అనంతరం గంగానమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్‌ మేకా ఈశ్వరయ్య, నాయకులు మద్దతు తెలిపారు.

ఏలూరు రూరల్‌: ఆటవిక పాలనతో జగన్‌ ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేస్తున్నారని, జగన్‌ రాష్ట్రంలో కనిపించకుండా తరిమి కొట్టేందుకు ప్రజలు వేచి చూస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బడేటి చంటి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా చే పలతూము సెంటర్‌లో రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. చంటి మాట్లాడుతూ కుట్ర పూరితంగా చంద్రబాబును అరెస్టు చేయించారని ధ్వజమెత్తారు. టీడీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎటువంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమాన్ని నాయుడు సోము, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

దెందులూరు: రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపే శక్తి ఉన్న చంద్రబాబు నాయుడిని అక్రమ కేసుల నుంచి వెంటనే విడుదల చేయాలని టీడీపీ పెదపాడు మండల అధ్యక్షుడు లావేటి శ్రీనివాసరావు, గుత్తా అనిల్‌ అన్నారు. దెందులూరులోని టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ మండల అధ్యక్షుడు మాగంటి నారాయణప్రసాద్‌, తెలుగు యువత అధ్యక్షుడు మోతుకూరి నాని ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరహార దీక్ష నిర్వహించారు. ఎన్‌ టీఆర్‌ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు బోడేటి మోహన్‌బాబు, పప్పల సుశీల, జడ్పీటీసీ సక్కుకుమారి, ఏనుగు రామకృష్ణ, యిప్పిలి వెంకటేశ్వర రావు, గారపాటి కొండయ్య చౌదరి, నున్న లక్ష్మణ్‌, తదితరులు పాల్గొన్నారు.

ఉంగుటూరు: చంద్రబాబు అక్రమ అరెస్టు దుర్మార్గమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు. రిలే దీక్షలో పాల్గొన్న నాయకుల నుద్దేశించి మాట్లాడారు. సైకో పోవాలి, సైకిల్‌ రావాలి నినాదాలతో దీక్షా శిబిరం మార్మోగింది. మారిశెట్టి శివప్రసాద్‌, తల్లాపురం సర్పంచ్‌ పసుపులేటి నరసింహరావు, పొన్నం లక్ష్మి వరప్రసాద్‌, నేకూరి ఆశీర్వాదం పాల్గొన్నారు.

Updated Date - 2023-09-23T00:15:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising