టీడీపీ నేతల నిరసన.. దీక్ష
ABN, First Publish Date - 2023-09-21T23:50:31+05:30
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది.
ఏలూరు కలెక్టరేట్, సెప్టెంబరు 21: చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. జిల్లాలో నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలతో వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కృష్ణా కాలువలో జలదీక్షతో నిరసన తెలిపారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పెనుబోయిన మహేష్ యాదవ్ మాట్లాడుతు స్కిల్ స్కామ్ కేసులో ఆధా రాలు లేక ప్రస్తుతం కొత్త కేసులు పెడుతున్నారన్నారు. చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టినా న్యాయస్థానాలు కొట్టివేస్తాయన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీము ద్వారా 2.5 లక్షల మంది శిక్షణ పొందగా లక్ష మందికి పైగా ఉద్యోగాలు సంపాదించారన్నారు. కార్యక్రమంలో మణికంఠ, పవన్, వేగి సిద్దు, ఎస్ సాయి, టి వంశీ, ఎం పవన్, మద్దిపాటి పవన్, నాయుడు పవన్, జగత్‌నాయుడు, గురజాల నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబును కాపాడుకునేందుకు టీడీపీ నాయకులు, శ్రేణులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా పోరాడుతారని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బడేటి చంటి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా చేపల తూము సెంటర్‌లో రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. చంద్రబా బుకు మద్దతుగా ఏలూరు బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసిస్తూ ప్రభుత్వ కుట్రలను ప్రజలకు తెలియజేసి బడేటి చంటి కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నాయుడు సోము, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఉంగుటూరు: ఎస్సీలను ఉద్దరిస్తున్నానని చెబుతున్న జగన్ ప్రభుత్వం వారి సంక్షేమ పధకాలను నిర్వీర్యం చేస్తున్నదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు. గురువారం ఉంగుటూరులో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జరుగుతున్న రిలే దీక్ష 9వ రోజుకు చేరింది. నిరాహార దీక్షలో ఎస్సీ విభాగం జిల్లా కన్వీనర్ యాళ్ళ సుజీవరావు, నియోజకవర్గ కన్వీనర్ యుగంధర్, మండల కన్వీనర్ నేకూరి ఆశీర్వాదం, కడియాల రవిశంకర్, బొమిడి అప్పారావు, ఇమ్మణ్ణి గం గాధరరావు, పొన్నం ప్రసాద్, పాతూరి విజయకుమార్, యెగ్గిన పెదబాబు తదితరులు పాల్గొన్నారు.
పెదవేగి: రాష్ట్ర భవిష్యత్‌కు చంద్రబాబునాయుడు ఒక్కడే ఆధారమని ఏఎంసీ మాజీ చైర్మన్ నెక్కలపూడి రామచంద్రరావు అన్నారు. తాళ్ళగోకరంలో టీడీపీ శ్రేణులు చంద్రబాబునాయుడుకు మద్దతుగా కొవ్వొత్తులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. రాజకీయ కక్షతో చంద్రబాబును జైలుకు పంపించిన దుష్ట పాలకుడు జగన్ అన్నారు. సర్పంచ్ నెక్కలపూడి సురేష్‌బాబు, ఎంపీటీసీ రాజారత్నం, కొనకళ్ళ శివమణి, ఆలూరి హరికృష్ణ, వెలివెల నాగరాజు, దాసరి రవి, బొర్రా సాంబశివరావు, జంగుమిల్లి శ్రీనివాసరావు, మానికొండ గీత, కమ్మిలి పెద్దింట్లు, రాచప్రోలు మరియమ్మ పాల్గొన్నారు.
Updated Date - 2023-09-21T23:50:31+05:30 IST