ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగుదేశం పార్టీతోనే ప్రజల భవిష్యత్‌కు భరోసా

ABN, First Publish Date - 2023-06-07T23:25:24+05:30

తెలుగుదేశం పార్టీతోనే ప్రజల భవిష్యత్‌కు భరోసా ఉంటుందని పార్టీ నాయకులు అన్నారు.

భీమడోలులో మేనిఫెస్టో ప్రదర్శిస్తున్న గన్ని, నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు

మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతల పిలుపు

ఉంగుటూరు (భీమడోలు), జూన్‌ 7: తెలుగుదేశం పార్టీతోనే ప్రజల భవిష్యత్‌కు భరోసా ఉంటుందని పార్టీ నాయకులు అన్నారు. టీడీపీ ప్రకటిం చిన మేనిఫెస్టోను ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు జిల్లాలో బుధవారం నియో జకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించారు. భీమడోలు పార్టీ కార్యాలయం లో ఉంగుటూరు నియోజకవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు మాట్లాడారు. రానున్న ఎన్నికలో పార్టీని గెలిపించడానికి నాయకులు, కార్యకర్తలు చేపట్టాల్సిన చర్యలపై గన్ని వీరాంజనేయులు దిశా నిర్దేశం చేసారు. తొలుత ఒడిశా రైలు ప్రమాద మృతులకు సంతాపం తెలిపారు. సమావేశంలో ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాష్ర్టాభివృద్ధే ధ్యేయంగా మేనిఫెస్టో

ఏలూరు టూటౌన్‌: ప్రజల సంక్షేమం, రాష్ర్టాభివృద్ధే ధ్యేయంగా టీడీపీ రూపొందించిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. బడేటి క్యాంపు కార్యాలయంలో టీడీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం బుధవారం జరిగింది. చంటి మాట్లాడుతూ మహానాడులో ప్రక టించిన మినీ మ్యానిఫెస్టో ప్రజలను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. అన్ని వర్గాల్లో మానిఫెస్టోపై విస్తృత చర్చ జరుగుతుందన్నారు. టీడీపీ మానిఫె స్టోతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందన్నారు. మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం విజ యం ఖాయమని ప్రజలు గుర్తించారన్నారు. ఎన్నికల వరకు నాయకులు, కార్యకర్తలంతా ప్రజల్లోనే ఉండాలన్నారు. పరిశీలకులు నవీన్‌ కుమార్‌, పాలి ప్రసాద్‌, ఉప్పాల జగదీష్‌బాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

బుట్టాయగూడెం: మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ అఽధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు భవిష్యత్‌కు గ్యారంటీ పేరు తో విడుదల చేసిన తొలివిడత మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసిన బాధ్యత టీడీపీ కుటుంబ సభ్యుల అందరిపైన ఉందని నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ అన్నారు. బుట్టాయగూడెం క్యాంపు కార్యాలయంలో తొలివిడత మేనిఫెస్టోపై చర్చా వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీడీపీ మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకువెళ్ళడమే కాకుండా జగన్‌రెడ్డి పాలనలో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వివరించాలన్నారు. జయవరపు శ్రీరామూర్తి, శీలం వెంకటేశ్వరావు, పారేపల్లి రామారావు, యంట్రప్రగడ శ్రీనివాసరావు, గద్దె అబ్బులు, అమరవరపు అశోక్‌, ములిశెట్టి నాగేశ్వరావు, బొడ్డు కృష్ణ, పారేపల్లి సురేష్‌, పరిమి రాంబాబు, మొడియం సూర్యచంద్రరావు, కె.రవి, తోట లక్ష్మీ నారాయణ, గన్నిన సురేంద్రనాథ్‌ చౌదరి, షేక్‌ సుభానీ పాల్గొన్నారు.

పేదల సంక్షేమం లక్ష్యంగా..

చింతలపూడి / లింగపాలెం: పేదల సంక్షేమం లక్ష్యంగా టీడీపీ మేనిఫెస్టో ప్రకటించిందని చింతలపూడి నియోజకవర్గ పరిశీలకుడు కోళ్ళ నాగేశ్వరరావు అన్నారు. భవిష్యత్‌కు భరోసా పేరిట ప్రగడవరంలో నిర్వహిం చిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు చేసేలా చంద్రబాబునాయుడు పథకాలు రూపొందించారన్నారు. మేనిఫెస్టోలో మహిళలకు పెద్ద పీట వేశారన్నారు. సంక్షేమ పథకాలు పేర్లు మార్చి ఈ జగన్మోహన్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నాడని, టీడీపీ ప్రభు త్వం రాగానే ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు భరోసా కూడా కల్పించేలా మేనిఫెస్టో ఉందన్నారు. మన భవిష్యత్‌కు భరోసా అంటూ సాగిన చర్చా వేదికలో నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఏఎంసీ మాజీ చైర్మన్‌ జగ్గవరపు ముత్తారెడ్డి, మాజీ ఎంపీపీ మోరంపూడి మల్లికార్జునరావు, గరిమెళ్ళ చలపతిరావు, తాళ్ళూరి చంద్రశేఖరరెడ్డి, మాటూరి వెంకట్రామయ్య, కొక్కిరిగడ్డ జయరాజు, దాసరి శ్యాం చంద్రశేషు, కొత్తాడ వెంకటేశ్వరరావు, కోండ్రు దేవా, కె.రాజశేఖర్‌ రెడ్డి, సుధీర్‌రెడ్డి, అనీష్‌, నాగరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T23:25:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising