ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాదాస్పద ఫ్లెక్సీలపై టీడీపీ, జనసేన నిరసన

ABN, First Publish Date - 2023-06-03T00:34:28+05:30

కైకలూరు తాలుకా సెంటర్లో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి సమీపాన ఏర్పాటు చేసిన అధికార పార్టీకి చెందిన ఫ్లెక్సీని తొలగించాలని కైకలూరు నియోజకవర్గ టీడీపీ, దళిత తేజం నాయకులు డిమాండ్‌ చేశారు.

కైకలూరులో ఎంపీడీవోకి వినతిపత్రాన్ని అందజేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కైకలూరు, జూన్‌ 2: కైకలూరు తాలుకా సెంటర్లో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి సమీపాన ఏర్పాటు చేసిన అధికార పార్టీకి చెందిన ఫ్లెక్సీని తొలగించాలని కైకలూరు నియోజకవర్గ టీడీపీ, దళిత తేజం నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం వివాదా స్పద ఫ్లెక్సీని తొలగించాలని ఎంపీడీవో రామలింగేశ్వరరావు, కైకలూరు టౌన్‌ సీఐ ఆకుల రఘుకు వినతిపత్రాన్ని అందజేశారు. పెత్తందారులకు పేదలకు మధ్య యుద్ధం వంటి బ్యానర్‌ను గత నెల 28న వైసీపీ నాయకులు ఏర్పాటుచేశారని దీని వల్ల ప్రజల మధ్య విభేదాలు పొడసూపే ప్రమాదం ఉందని, వీటిని తొలగించాల్సిన బాధ్యత అధికారుల పై ఉందని పైగా ఆ బ్యానర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి అడ్డుగా ఉండటం ఆయనను అవమా నించినట్టేనని, తక్షణమే ఈ బ్యానర్‌ను తొలగించాలని కోరారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షు డు చాబత్తిన విజయ్‌, మండవల్లి మండల ప్రధాన కార్యదర్శి పళ్లెం ఏడుకొం డలు, సీనియర్‌ నాయకుడు తేరా రమేష్‌, మైనార్టీ నాయకుడు సదర్ల సూరి, పార్టీ నాయకులు వీరాబత్తిన సుధ, ఆకునూరి సంగీతరావు, పళ్లెం తాతారావు తదితరులు పాల్గొన్నారు.

జనసేన ర్యాలీ

పవన్‌కల్యాణ్‌ను కించపరస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తక్షణమే తొలగించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. శుక్రవారం కైకలూరు పార్టీ కార్యాలయం నుంచి నలుపు దుస్తులతో ర్యాలీగా నిరసన తెలిపారు. వివాదస్పదమైన బ్యానర్ల వల్ల శాంతిభద్రతలు అదుపు తప్పే ప్రమాద ముందని వెంటనే వాటిని తొలగించకుంటే జనసేన పార్టీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు కైకలూరు తహసీల్దార్‌ మురళీకృష్ణ, టౌన్‌ సీఐ ఆకుల రఘుకు వినతిపత్రాలు ఇచ్చారు. నాయకులు కొల్లి వరప్రసాద్‌, తోట లక్ష్మి, నల్లగోపుల వెంకట చలపతి, ఎస్‌. రాజేశ్వరి, బి. సాయి, జి. సుధీర్‌, టి.ప్రసాద్‌, ఎస్‌.దశరథ్‌, సీహెచ్‌ శ్రీనివాసరావు, టి. చిన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:34:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising