రాష్ట్రంలో వైసీపీ పతనం ప్రారంభం
ABN, First Publish Date - 2023-03-26T00:28:32+05:30
రాష్ట్రంలో వైసీపీ పతనం ప్రారంభమైందని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు.
టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని
ఉంగుటూరు, మార్చి 25 : రాష్ట్రంలో వైసీపీ పతనం ప్రారంభమైందని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. శనివారం ఉంగుటూరు పాతూరి కల్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఇటీవల ఎమ్మెల్సీల విజయం సాధించడంపై ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టమవుతుం దన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల జయకేతనంపై ‘ఇది ఆంధ్రల విజయం’ అనే వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. మరో అతిథిగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కన్వీనర్ బడేటి రాధాకృష్ణ మాట్లాడుతూ వైసీపీ వలంటీర్ల పార్టీ అని టీడీపీ కార్యకర్తల పార్టీ అని అన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు షేక్ మీరా సాహెబ్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షుడు పాతూరి విజయకుమార్, ఇందుకూరి రామకష్ణ, ముత్యాల రామకష్ణ, సిరిబత్తిన వీర వెంకట సత్యనారాయణ, రెడ్డి సూర్యచంద్రరావు, యాళ్ళ సుజీవరావు, యాళ్ళ సుబ్బారావు, పైడిమాల యుగంధర్, అద్దేపల్లి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
జగన్‌ను ఓడించడానికి సిద్ధంగా ఉండాలి : పల్లి శ్రీను
లింగపాలెం, మార్చి 25 : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌ను ఓడించడానికి ప్రతిఒక్కరూ సిద్ధంగా ఉండాలని వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఏడాది గడ్డుకాలమేనని టీడీపీ చింతలపూడి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పల్లి శ్రీను అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలే సొంత పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించి అనేక సంక్షేమ పథకాలను అమలు పరచాలంటే పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు మాత్రమే సాధ్యమన్నారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అని అనుభవజ్ఞుడైన చంద్రబాబును రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. బీసీ సెల్ అధ్యక్షుడు తాళం సోంబాబు, నంజ్యేటి మురళీమోహన్, వాణిజ్య సెల్ ప్రధాన కార్యదర్శి కందుల కేశవరావు, ఎడవల్లి పాపారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-26T00:28:32+05:30 IST