ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన సీఎం జగన్‌

ABN, First Publish Date - 2023-02-06T23:58:29+05:30

రాష్ర్టాన్ని సర్వనాశనం చేసి ప్రజల భవిష్యత్‌ను జగన్‌ అంధకారంలోకి తోశాడని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బడేటి రాధాకృష్ణయ్య(చంటి) ఆరోపించారు.

అంతర్వేదిగూడెంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న బొరగం శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ నేతల ధ్వజం

ఏలూరు టూటౌన్‌, ఫిబ్రవరి 6: రాష్ర్టాన్ని సర్వనాశనం చేసి ప్రజల భవిష్యత్‌ను జగన్‌ అంధకారంలోకి తోశాడని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బడేటి రాధాకృష్ణయ్య(చంటి) ఆరోపించారు. ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా నాలుగో డివిజన్‌లో సోమవారం పాదయాత్ర నిర్వహించారు. వైసీపీ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేరన్నారు. ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, వైసీపీ ప్రభుత్వ పతనం ఖయమన్నారు. కార్యక్రమంలో ఆర్‌.లాలాలజపతిరాయ్‌, దాసరి ఆంజనేయులు, మల్లిక్‌, ఆర్‌.అజయ్‌, సురేష్‌, సంజీవ్‌, కే.మహేష్‌, తదితరులు పాల్గొన్నారు.

బుట్టాయగూడెం: రాష్ట్రంలో జగన్‌రెడ్డి అసమర్ధ, అవినీతి పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీ నర్‌ బొరగం శ్రీనివాస్‌ అన్నారు. అంతర్వేదిగూడెం పరిధిలోని గ్రామాల్లో ఇదేం ఖర్మ రాష్ర్టానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పూసం ముక్కమ్మ, కొమరం మల్లేశ్వరావు, ఆండ్రు శ్యామ్‌కుమార్‌, తెల్లం వెంకటేశ్వరావు, వెట్టి రాయుడు, కొవ్వాసి వెంకన్న బాబు, కోర్స పోసి, తాటి దుర్గా తదితరులు పాల్గొన్నారు.

నిడమర్రు: జగన్‌ను సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు. అడవికొలనులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ముత్యాల స్వామి, పొట్నూరి సింహాచలం, పైడికొండల శివాజి, పోశింశెట్టి రాంమూర్మి, ఆదిరెడ్డి చంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:58:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising