ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్ను వసూళ్లలో రికార్డు

ABN, First Publish Date - 2023-04-03T00:04:05+05:30

ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నప్పటికీ ఈసారి పురపాలక సంఘాల్లో పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి నెలాఖరు నాటికి 91 శాతం పన్ను వసూళ్లు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మార్చి నెలాఖరుకు 91 శాతం వసూళ్లు

మొదటి స్థానంలో తణుకు

నరసాపురం, ఏప్రిల్‌ 2: ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నప్పటికీ ఈసారి పురపాలక సంఘాల్లో పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి నెలాఖరు నాటికి 91 శాతం పన్ను వసూళ్లు చేశారు.ఇదే వసూళ్లలో ఆల్‌టైం రికార్డు. మొత్తం జిల్లాలోని ఆరు పురపాలక సంఘాల్లో రూ.63.65 కోట్లు డిమాండ్‌ ఉండగా రూ.54.39 కోట్లు వసూలు చేశారు. మొదటి స్ధానంలో తణుకు నిలిచింది. ఇక్కడ రూ 11.80 కోట్లు డిమాండ్‌ ఉండగా రూ.10.91 కోట్లు వసూలు చేశారు. ఆ తరువాత స్ధానంలో నరసాపురం నిలిచింది. రూ.5.11 కోట్లు డిమాండ్‌ ఉండగా రూ.4.61 కోట్లు వసూలు చేశారు. పాలకొల్లులో రూ.8.23 కోట్లు డిమాండ్‌ ఉండగా రూ.6.22 కోట్లు వసూలు చేశారు. ఈఏడాది కూడా ముందస్తు పన్ను వసూళ్లు 5 శాతం రిబేట్‌ ప్రకటించారు. ఏడాది పన్ను ఒకేసారి చెల్లిస్తే దానిపై ఐదు శాతం రాయితీ వస్తుంది. ఈ ఏడాది పన్ను వసూళ్ళల్లో కూడా చివరిలో ప్రభుత్వం వడ్డీ మినహాయింపు ప్రకటించింది. చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకుని బకాయిలు క్లియర్‌ చేసుకున్నారు. పురపాలక సంఘాల వారీగా వసూళ్లు ఇలా ఉన్నాయి

మునిసిపాలిటీ డిమాండ్‌ వసూళ్ళు

తణుకు 11.80 10.91

నరసాపురం 5.11 4.61

ఆకివీడు 2.49 2.22

భీమవరం 21.35 18.92

తాడేపల్లిగూడెం 14.61 11.47

పాలకొల్లు 8.28 6.22

Updated Date - 2023-04-03T00:04:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising