ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీవోలపై చర్యలు తీసుకోండి

ABN, First Publish Date - 2023-06-11T00:17:08+05:30

ఉపాధి కూలీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఏపీవోలపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మికసంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

డ్వామా పీడీకి వినతిపత్రం అందజేస్తున్న కార్మిక సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు కలెక్టరేట్‌/ఏలూరు టూటౌన్‌,జూన్‌ 10: ఉపాధి కూలీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఏపీవోలపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మికసంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. సంఘం ఆధ్వర్యంలో శనివారం జిల్లా డ్వామా పీడీ ఎ.రాముకు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్ష, కార్య దర్శులు ఎం. జీవరత్నం, పి. రామకృష్ణ మాట్లాడుతూ, ఉపాధి హామీలో నేడు అన్ని స్ధాయిల్లో అవినీతి కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు కూలీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో అసిస్టెంట్‌ ప్రోగ్రామింగ్‌ అధికారుల కనుసన్నల్లోనే డబ్బులు వసూలు దందా జరుగుతుందన్నారు. పెదవేగి మండలం లక్ష్మీపురంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ లేకుండానే గ్రామ వలంటీర్ల ద్వారా అటెండెన్సు వేయించడం చట్టవిరుద్దమన్నారు. పి.ముత్యాలమ్మ, ఎస్‌. మహంకాళి, టి. సత్యనారాయణ, ఎం. సుధారాణి, మాధవ, ప్రభాకర్‌, సీత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-11T00:17:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising