ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టైలర్స్‌ అందరూ ఐక్యంగా ఉండాలి

ABN, First Publish Date - 2023-02-28T23:57:07+05:30

టైలర్స్‌ అందరూ ఐక్యంగా ఉండాలని వెంకటేశ్వర నవ్యాంధ్ర టైలర్‌ అసోసియేషన్‌ ఏలూరు జిల్లా అధ్యక్షుడు బూస బాల భాస్కర్‌రెడ్డి అన్నారు.

వేలేరుపాడులో మాట్లాడుతున్న బాలభాస్కర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వెంకటేశ్వర నవ్యాంధ్ర టైలర్స్‌ జిల్లా అధ్యక్షుడు బాల భాస్కర్‌రెడ్డి

జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 28 : టైలర్స్‌ అందరూ ఐక్యంగా ఉండాలని వెంకటేశ్వర నవ్యాంధ్ర టైలర్‌ అసోసియేషన్‌ ఏలూరు జిల్లా అధ్యక్షుడు బూస బాల భాస్కర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో టైలర్స్‌డే సందర్భంగా విలియం హోవే విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కేత వరానికి చెందిన మందపాటి దుర్గారావు అనే టైలర్‌ సోదరుడు క్యాన్సర్‌తో బాధపడుతుండడంతో అతనికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారు. కౌ న్సిలర్‌ దొంతు మాధవరావు, జిల్లా ఉపాధ్యక్షుడు జె.రామారావు పాల్గొన్నారు

వేలేరుపాడు : వేలేరుపాడులో ఏలూరు జిల్లా టైలర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు బాలభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో విలియమ్స్‌ హోవే చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం వేలేరుపాడు ఎస్‌ఐ ఆర్‌.శ్రీను మాట్లా డారు. జిల్లా నాయకులు రామారావు, మాధవరావు, శివనాగేశ్వరరావు, ఎండీ మున్నీర్‌, మాచర్ల లక్ష్మి, మహ్మద్‌, నాయకులు పాల్గొన్నారు.

ఫ కుక్కునూరు, : కుక్కునూరులో టైలర్స్‌ సంఘ మండల అధ్యకుడు ఎంఎస్‌ ఆనంద్‌ ఆధ్వర్యంలో టైలర్స్‌ డే వేడుకలు నిర్వహించారు. సంఘ కారదర్శి పాదం రాము, కొన్నే లక్ష్మయ్య, సభ్యులు పాల్గొన్నారు.

పోలవరం :టైలర్స్‌ జీవితాలకు ఆద్యుడైన విలియమ్స్‌ హూవేకు అందరూ రుణపడి ఉండాలని శ్రీసాయి టైలర్స్‌ సొసైటీ అధ్యక్షుడు గానాల బాబ్జీ అన్నారు. మంగళవారం పోలవరంలోని మసీదు వీధిలో టైలర్స్‌ డే వేడుకలు నిర్వహించారు. కార్యదర్శి నూలు శ్రీనివాస బాబ్జీ, సభ్యులు పాల్గొన్నారు.

కొయ్యలగూడెం : టైలర్స్‌కు, చేతివృత్తిదారులకు కమ్యూనిటీ హాలు నిర్మిస్తానని టైలర్స్‌ డే వేడుకలలో కొయ్యలగూడెం సర్పంచ్‌ ముప్పిడి విజయ కుమారి హామీ ఇచ్చారు. టైలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

ఏలూరు రూరల్‌ : టైలర్ల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్టు మాజీ ఉపముఖ్య మంత్రి ఆళ్ళ నాని పేర్కొన్నారు. స్థానిక పత్తేబాద టైలర్స్‌ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం టైలర్స్‌డే కార్యక్రమం నిర్వహించారు. గౌరవాధ్యక్షుడు వి.నాగేంద్ర, అధ్యక్షుడు ఎండి హుస్సేన్‌ ఆధ్వర్యంలో కుట్టుమిషన్‌ సృష్టికర్త విలియమ్‌ హోవే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగర మేయర్‌ నూర ్జహాన్‌, కో–ఆప్షన్‌ సభ్యుడు పెదబాబు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

ఉంగుటూరు: ఉంగుటూరులో విలియమ్‌ హోవే చిత్రపటానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు దొంతంశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్‌ టైలర్లు సూర్యకుమారి, షేక్‌ సత్తార్‌ షరీఫ్‌లను సత్కరించారు. కైకరంలో సీనియర్‌ దర్జీ యర్రోజు సుబ్బారావు దంపతులను సంఘ పెద్దలు ఘనంగా సత్కరించారు.

ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమలలో మంగళవారం యూనియన్‌ ఆధ్వర్యంలో టైలర్స్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. విలియమ్స్‌ హో చిత్రపటానికి వైసీపీ మండల నేతలు బొండాడ వెంకన్నబాబు, ప్రతాపనేని వాసు, జంగా కృష్ణారెడ్డి, గుర్రాల లక్ష్మణ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - 2023-02-28T23:57:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!