ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దోషులను వదిలిపెట్టం

ABN, First Publish Date - 2023-07-12T23:55:24+05:30

పులిరాముడుగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో 4వ తరగతి విద్యార్థి గోగుల అఖిల్‌వర్ధనరెడ్డి హత్య కేసులో దోషులు ఎంతటివారైనా వదలిపెట్టేదిలేదు.

అఖిల్‌ తల్లిదండ్రులకు రూ.10 లక్షల చెక్కును అందిస్తున్న మంత్రి రాజన్నదొర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యార్థి హత్య కేసులో పోలీసుల పురోగతి

పులిరాముడుగూడెం గిరిజన పాఠశాలలో మంత్రి రాజన్నదొర

బుట్టాయగూడెం, జూలై 12 : ‘పులిరాముడుగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో 4వ తరగతి విద్యార్థి గోగుల అఖిల్‌వర్ధనరెడ్డి హత్య కేసులో దోషులు ఎంతటివారైనా వదలిపెట్టేదిలేదు. వారికి కఠిన శిక్షలు తప్పవు. హత్య కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు’ అని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. బుధవారం ఆయన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి హత్యకు గురైన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్టల్‌ను వదలి పెట్టమని చెప్పడానికి వాళ్లెవరు..? ఇటువంటి క్రూరులను బయట సమాజంలో తిరగనివ్వ కూడదని, త్వరలోనే నిందితులను పట్టుకోవాలని జిల్లా కలెక్టర్‌తోపాటు పోలీసులను ఆదేశించారు. అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. పిల్లలతోపాటు తాము వసతి గృహంలో ఉంటామని ఎవరైనా తల్లిదం డ్రులు సుముఖత తెలిపితే వారికి కొంత కాలంపాటు ఉచిత భోజన, వసతితోపాటు గౌరవ వేతనం ఇస్తామ న్నారు. అనంతరం అఖిల్‌ తల్లిదండ్రులు శ్రీనివాస్‌, రామలక్ష్మిలను ఓదార్చారు. సీఎం సహాయ నిధి నుంచి రూ.10 లక్షల చెక్కును వారికి అందజేశారు. వలంటీర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌కు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం, జగనన్న ఇల్లు ఇస్తామని తెలిపారు. విద్యార్థులతో మంత్రి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వసతి గృహం, పాఠశాలలో మౌలిక సదు పాయాలను పరిశీలించారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థితో మాట్లాడి మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాలన్నారు. కలెక్టర్‌, ఐటీడీఏ చైర్మన్‌ వై.ప్రసన్న వెంకటేశ్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ జె.మురళి, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఆర్డీవో ఝాన్సీ రాణి, పీవో జీవీవీ సత్యనారాయణ, డీడీ పీవీఎస్‌ నాయుడు, ఈఈ రమాదేవి, ఎంపీపీ కారం శాంతి, జడ్పీటీసీ ఎం.రామతులసీ తహసీల్దార్‌ ఎస్‌.శారాశాంతి ఉన్నారు.

Updated Date - 2023-07-12T23:55:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising