ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సకల శుభాల శ్రావణం

ABN, First Publish Date - 2023-08-17T00:16:47+05:30

నిజ శ్రావణమాసం గురువారం నుంచి ప్రారంభం కానుంది. నెల రోజులపాటు భగవన్నామ స్మరణ లతో తెలుగు లోగిళ్లు మారు మోగనున్నాయి. నోములు, వ్రతా లు, పూజలు, ఉపవాసాలతో మహిళలు తమ భక్తి ప్రవ త్తులను చాటనున్నారు.

శ్రావణ పూజలకు ముస్తాబవుతున్న కుంకుళ్లమ్మ ఆలయప్రాంగణం

నేటి నుంచి ప్రారంభం.. 19 నుంచి పెళ్లి ముహూర్తాలు

ద్వారకా తిరుమల, ఆగస్టు 16 : నిజ శ్రావణమాసం గురువారం నుంచి ప్రారంభం కానుంది. నెల రోజులపాటు భగవన్నామ స్మరణ లతో తెలుగు లోగిళ్లు మారు మోగనున్నాయి. నోములు, వ్రతా లు, పూజలు, ఉపవాసాలతో మహిళలు తమ భక్తి ప్రవ త్తులను చాటనున్నారు. మరోవైపు ఆషాఢం, అధిక శ్రావణంతో రెండు నెలల విరామం తర్వాత మళ్లీ భాజా భజంత్రీల మోతలు వినిపించనున్నాయి. ఈ నెల 19 నుంచి డిసెంబరు 31 వరకు సుమారు 53 మంచి ముహూర్తాలు ఉన్నట్టు పండితులు చెబుతున్నారు. వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, శుభకార్యాలు జోరందుకోనున్నాయి. దీంతో కొద్ది రోజులుగా ముహూర్తాలు లేకపోవడంతో స్తబ్దుగా వున్న ద్వారకా తిరుమల క్షేత్రం మళ్లీ వివాహాలతో కళకళలాడనుంది. ఆగస్టులో 19, 20, 22, 24, 26, 29, 30, 31 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. 24వ తేదీ రాత్రి గం.3.42 నిలకు, 30 రాత్రి 11.30 ముహూర్తాలు బలమైన ముహూర్తాలని పురోహితులు చెప్పారు. సెప్టెంబరులో 1, 2, 3, 6, 7, 8 తేదీల్లో ముహూర్తాలు ఉండగా సెప్టెంబరు 1వ తేదీ రాత్రి 11.22 గంటలకు, రెండో తేదీ రాత్రి 11.18కు, 2.08కు, 3.06 గంటలకు, 3 రాత్రి 11.14కు, 3.02కు, 6 రాత్రి 2.50కు, 3.08కు, 7వ తేదీ పగలు 11.21, రాత్రి 1.49, గం.2.46 ని.లకు ముహూర్తాలు ఉన్నట్టు పండితులు సారఽథి, గోవిందవఝల వెంకట రమణమూర్తి శర్మ తెలిపారు. ఇందులో 1, 2, 6 తేదీల్లో మంచి ముహూర్తాలని వారు వివరించారు. తర్వాత నెల భాద్రపదం శూన్య మాసమని తిరిగి ఆశ్వీయుజం నుంచి మళ్లీ వివాహ ముహూర్తాలు ప్రారంభమవుతాయన్నారు.

ఈ ఏడాది అధిక శ్రావణం

ఈ ఏడాది అధిక శ్రావణ మాసం వచ్చింది. పంచాంగం లెక్కింపులో తేడాలే కారణమని పండితులు చెబుతున్నారు. సౌరమానం ప్రకారం కాలాన్ని లెక్కిస్తే 365 రోజుల ఆరు గంటలు వస్తే చంద్రమానం ప్రకారం 354 రోజులు మాత్రమే ఉంటాయి. అంటే దాదాపు 11 రోజుల తేడా వస్తుంది. ఏడాది గణన లో ఉండే ఈ తేడాలను బ్యాలెన్స్‌ చేసేందుకు ప్రతీ మూడేళ్లకు ఓసారి ఒక మాసం అధికంగా వస్తుంది. అయితే అధిక శ్రావణమాసం మాత్రం 19 ఏళ్లకోసారి వస్తుంది. తెలుగు పంచాంగం ప్రకారం జూలై 18 నుంచి అధిక శ్రావణ మాసం, ఆగస్టు 17 నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభం అవు తుంది. ఇది సెప్టెంబరు 16వ తేదీ వరకు ఉంటుంది. హిందూ సనాతనధర్మం ప్రకారం తెలుగు మాసాల్లో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. వర్షాలు పడుతుంటాయి. వ్యవసాయ పనులు జరుగుతుంటాయి. శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం, పౌర్ణమి చంద్రునితో కలవడంతో ఈ మాసం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో శివయ్యను పూజిస్తారు. అభిషేక ప్రియుడైన శివదేవుని ఆరాధిస్తే నవగ్రహాలు శాంతిస్తాయని పండితులు చెబుతున్నారు. ఆలయాలకు భక్తుల రాకను పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా అన్ని ఆలయాలు ముస్తాబవుతున్నాయి. ఆషాఢం వెళ్లిన తర్వాత శ్రావణమాసంలో కొత్త అల్లుళ్లు అత్తారిళ్లకు వెళ్లడం ఆచారం.

మహిళలకు వరప్రదాయని

శ్రావణ మాసం మహిళలకు వరప్రదాయినిగా పురాణేతిహాసాలు పేర్కొంటున్నాయి. ఈ మాసం రాకకోసం మహిళలు ఎదురుచూస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఈనెలలో 18న మొదటి శుక్రవారం నుంచి ప్రతీ శుక్రవారం మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీవ్రతాలను ఆచరిస్తారు. సంతాన, సౌభాగ్యాల కోసం ప్రతీ మంగళవారం తమ ఇళ్ల వద్ద అమ్మవారిని పసుపుతో అలంకరించి మంగళగౌరీ వ్రతం ఆచరిస్తారు. మొలకలతో కూడిన పప్పు ఽధాన్యాలను వాయినంగా సమర్పిస్తారు. 25న వచ్చే రెండో శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ వారాన్నే వరలక్ష్మీ వ్రతంగా ఆచరిస్తారు.

ఈ మాసంలో అన్నీ పండుగలే..

నాగుల పంచమి. మంగళ గౌరీవ్రతం, రాఖీ పౌర్ణమి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ సోమవారం, శ్రీకృష్ణ జన్మాష్టమి, సంకట హర చతుర్థి, పోలాల అమావాస్య ఈ శ్రావణమాసంలో ప్రాచుర్యం పొందిన పర్వదినాలు.

Updated Date - 2023-08-17T00:16:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising