ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి : ఎస్పీ

ABN, First Publish Date - 2023-02-21T01:01:34+05:30

పోలీసు స్పందన కార్యక్రమా నికి వచ్చే అర్జీదారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని త్వరి తగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ సూచిం చారు.

బాధితుల గోడు వింటున్న ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు రూరల్‌, ఫిబ్రవరి 20 : పోలీసు స్పందన కార్యక్రమా నికి వచ్చే అర్జీదారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని త్వరి తగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ సూచిం చారు. సోమవారం జిల్లా ఎస్పీ ప్రధాన కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. కేన్సర్‌ బాధితులకు కేంద్రం పేద ప్రజలకు 15 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తుందని నమ్మించి లక్ష రూపాయలు తీసుకుని ఓ వ్యక్తి మోసం చేశాడని అతనిపై చర్యలు తీసుకోవాలని ఏలూరు కొత్తగూడెం సెంటర్‌కు చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేసింది. తన సోదరి ఆత్మహత్యకు కారణ మైన ఇద్దరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఏలూరు వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఎస్పీని కోరారు. తన భర్త మరో మహిళతో వివా హేతర సంబంధం ఏర్పరుచుకుని తనను ఇబ్బ ందులు పెడుతున్నాడని న్యాయం చేయాలని ఒకరు, మాయ మాటలు చెప్పి ఉద్యోగం చేస్తున్నట్లు నమ్మించి పెళ్ళి చేసుకుని అధిక కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్న భర్త కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని మరో మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. సమస్యలు సత్వరమే పరిష్కరించాలని పోలీసు అధికా రులను ఆదేశించారు.

Updated Date - 2023-02-21T01:01:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising