ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రతిభ చూపే మంచి ప్లాట్‌ ఫాం సోషల్‌ మీడియా

ABN, First Publish Date - 2023-08-01T00:36:13+05:30

‘అవకాశాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులు పోయాయి. మనం ఏదైనా సాధించాలంటే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంపై మన ప్రతిభను చూపిం చడం ద్వారా అవకాశాలు అవే వస్తాయి.

పవన్‌ బాసింశెట్టి

తాడేపల్లిగూడె రూరల్‌, జూలై 31: ‘అవకాశాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులు పోయాయి. మనం ఏదైనా సాధించాలంటే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంపై మన ప్రతిభను చూపిం చడం ద్వారా అవకాశాలు అవే వస్తాయి. కొంత టెక్నాలజీ మరికొంత స్మార్ట్‌వర్క్‌ చూపిస్తే మన ప్రతిభ అందరికి చేరుతుంది. తద్వారా లక్ష్యాలు సాధించవచ్చ’ని రంగబలి డైరెక్టర్‌ పవన్‌ బాసింశెట్టి చెబుతున్నారు. స్వస్థలం తాడేపల్లిగూడెం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మాది నల్లజర్ల మండలం తెలికిచర్ల. నాన్న గంగాధరరావు, అమ్మ కాశీరత్నం, అక్క సురేఖ. వ్యాపారరీత్యా చిన్నప్పుడే నాన్నతో తాడేపల్లిగూడెం వచ్చేశాం. చదువు ఇక్కడే జరిగింది. బెంగళూరులో ఎంబీఏ చదివాను. ఆ సమయంలోనే స్నేహితుల తో కలిసి సరదాగా యాడ్‌ ఫిల్మ్‌కు రచయితగా వ్యవహరించా. తర్వాత రైటర్‌గా స్థిరపడాలనుకున్నా. తర్వాత స్నేహితురాలు స్వప్నని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అందరి సహకారంతో రైటర్‌గా మారాను. రూ.40 వేలతో ఓ షార్ట్‌ఫిల్మ్‌ తీయడానికి నా భార్యే ప్రొడ్యూసర్‌. ఆ ఫిల్మే నాలో డైరెక్టర్‌ను బయటకుతీసి ఈ సినిమా చేసేందుకు ప్రొత్సాహాన్ని ఇచ్చింది. సినిమా రంగంలోకి ఏదో సాధించాలని హైదరాబాద్‌ వెళ్లి నాలుగేళ్లు అయింది. పలుచోట్ల రైటర్‌గా పనిచేశా. కృష్ణవిందా విహారి చిత్ర నిర్మాణ సమయంలో రైటర్‌గా పనిచేసి హీరో నాగశౌర్యతో పరిచయం ఏర్పడింది. గోదావరి జిల్లా ల యాసను మాట్లాడుతూ పెరిగాను. ఇక్కడ వెటకారం ఎంత ఉంటుందో అదే స్థాయిలో అభిమానం ఉంటుంది. నా రచనలో ప్రతీచోట మన యాస కొట్టొచ్చినట్టు కనిపించేలా సినిమాలు తీసేందుకే ప్రాధాన్యాత ఇస్తాను. నాకు జంధ్యాల సినిమాలే ఇన్‌స్ర్పేషన్‌. హీరో నాగశౌర్య నమ్మకాన్ని నిలబెట్టేలా చిత్రం మంచి రెస్పాన్స్‌ అందుకుంది. బ్రేక్‌ ఈవెన్‌ సాధించగలిగాం. రంగ బలి చిత్రం తీస్తుండగానే నా కూతురు పుట్టింది. కనుక చిత్ర నిర్మాణ సంస్థ పేరు శ్రీలక్ష్మి.. హీరో నాగశౌర్య పెట్టిన పేరు నిర్వి కలిసి శ్రీ లక్ష్మి నీర్విగా నామకరణం చేశాం’ అని ముచ్చటించారు.

Updated Date - 2023-08-01T00:36:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising