నేడు విద్యాసంస్థల బంద్
ABN, First Publish Date - 2023-07-25T00:02:19+05:30
రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు మంగళవారం విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాలోని ప్రైవేటు జూనియర్ కళాశాలలు, పాఠశాలలను స్వచ్ఛందంగానే మూసివేయాలని నిర్ణయం తీసుకున్నాయి.
స్టూడెంట్ యూనియన్ల పిలుపు
ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు ‘సెలవు స్వచ్ఛందం’
ఏలూరు ఎడ్యుకేషన్, జూలై 24 : రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు మంగళవారం విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాలోని ప్రైవేటు జూనియర్ కళాశాలలు, పాఠశాలలను స్వచ్ఛందంగానే మూసివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. అధిక ఫీజుల నియంత్రణ, టీచర్ పోస్టుల భర్తీ, విద్యా, వసతి దీవెన బకాయిల చెల్లింపు తదితర డిమాండ్లపై విద్యాసంస్థల బంద్‌ను నిర్వహిస్తున్నట్టు టీఎన్‌ఎస్‌ఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ తదితర మరో నాలుగు సంఘాలు ప్రకటించిన విషయం విదితమే. అన్ని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలను స్వచ్ఛందంగానే మంగళవారం మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఏలూరు ఎన్నారై కళాశాల సీఈవో తులసీరామ్ వెల్లడించారు. దూర ప్రాంతాల నుంచి కళాశాలలకు వచ్చే విద్యార్థులు బంద్‌కారణంగా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. కాగా విద్యార్థి సంఘాల నాయకుల అభ్యర్థన మేరకు మంగళవారం జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తు న్నట్టు ఏపీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం (అపుస్మా) ఏలూరు జోన్ కార్యదర్శి ఎన్.ఎస్.ఆర్.కె.ప్రసాద్ సోమవారం రాత్రి వెల్లడించారు. ఈమేరకు అపుస్మా తీర్మానించిందన్నారు. ఇదిలాఉండగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను మూసివేయించేందుకు విద్యార్థిసంఘాల నాయకులు జిల్లాలోని ప్రాంతాల వారీగా బృందాలను ఏర్పాటు చేశారు.
Updated Date - 2023-07-25T00:02:19+05:30 IST