స్త్రీ విద్యకు సావిత్రి బాయి ఫూలే కృషి
ABN, First Publish Date - 2023-01-03T23:28:23+05:30
బడుగు బలహీన వర్గాల మహిళలను బానిసత్వం, అక్రమ రవాణా నుంచి కాపాడిన మహోన్నత వ్యక్తి సావిత్రి బాయి ఫూలే అని పీఎస్‌ఎం బాలికోన్నత పాఠశాల హెచ్‌ఎం జే సుధారాణి అన్నారు.
జయంతి కార్యక్రమాల్లో ఘన నివాళి
భీమవరం ఎడ్యుకేషన్ / అర్బన్, జనవరి 3: బడుగు బలహీన వర్గాల మహిళలను బానిసత్వం, అక్రమ రవాణా నుంచి కాపాడిన మహోన్నత వ్యక్తి సావిత్రి బాయి ఫూలే అని పీఎస్‌ఎం బాలికోన్నత పాఠశాల హెచ్‌ఎం జే సుధారాణి అన్నారు. సావిత్రి భాయి ఫూలే జయంతి సందర్భంగా మంగళవారం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్త్రీ విద్యకు విశేష కృషి చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయిని ఆదర్శంగా తీసుకోవాలని హెచ్‌ఎం అన్నారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి జిల్లా కార్యదర్శి సికిలే పుష్పకుమారి, సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, పట్టణ కార్యదర్శి చెల్లబోయిన రంగారావు, యేలేటి విజయానంద్, ఆకలి రాము మహిళా సమాఖ్య సభ్యులు పులమాలు వేసి నివాళులర్పించారు.
నరసాపురం టౌన్: పట్టణంలోని శివాలయం సెంటర్‌లో సావిత్రి ఫూలే బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి వనమాల శ్రీనివాస్, 3వార్డు ల్లో ఓబీసీ చైర్మన్ పెండ్ర వీరన్న పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందక రామకృష్ణ, కొరాడా పాపారావు, కొల్లాడి సాంబమూర్తిరాజు, కె.నరేష్, సుదీర్, కడలి అదినారాయణ, అద్దంకి భాస్కర్ ఉన్నారు.
మొగల్తూరు: పీడీఆర్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన సావిత్రి బాయి ఫూలే జయంతి కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్ష్య, కార్యదర్శులు కుక్కల సత్యనారాయణ, కండిబోయిన సుబ్రహ్మణ్యం మాట్లాడారు. పెంకే వెంకటేశ్వరరావు, పెంకే జగన్‌మోహనరావు, జక్కంశెట్టి రాంబాబు, కుక్కల సోమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పడవల మేరీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వార్డు సభ్యులు రామనాధం బుజ్జి, పొన్నపల్లి శ్రీలక్ష్మీ, యల్లమిల్లి గణపతి, ముక్కు గోపాలకృష్ణ, మద్దూరి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. ముత్యాల పల్లి బండి ముత్యాలమ్మ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయినులను సన్మానిం చారు. కట్టా వేణుగోపాలకృష్ణ, హెచ్‌ఎం బాల నాగమణి, కుమారి, చింతపల్లి కృష్ణమోహన్ ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
తణుకు: స్ర్తీలు విద్యావంతులు కావాలని సావిత్రీబాయి ఫూలే ఎంత గానో పోరాడారని చిట్టూరి ఇంద్రయ్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. వెంక టేశ్వరరావు అన్నారు. ఫూలే జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకోవాలని సూచించారు. వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్.ఏడుకొండలు, ఐక్యూ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, కనక మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-03T23:28:26+05:30 IST