సంక్రాంతి సంబరాలు
ABN, First Publish Date - 2023-01-12T00:29:51+05:30
జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా నిర్వహించారు.
జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా నిర్వహించారు. సంక్రాంతి సంస్కృతిని తెలిపే విధంగా విద్యార్థుల వేషధారణలు ఆకట్టుకున్నాయి.
నరసాపురం టౌన్, మొగల్తూరు, జనవరి 11: నరసాపురం పట్టణంలోని సూర్య విద్యా సంస్థలో చైర్‌పర్సన్ వెంకటరమణ, రోటరీక్లబ్ సభ్యులు, విద్యార్థులు వేడుకల్లో పాల్గొన్నారు. పట్టణంలోని గౌతమి, టేలర్, పాలకొల్లు రోడ్‌లోని సంసిద్ద్ స్కూళ్ళలో కరస్పాండెంట్లు చినమిల్లి దుర్గాప్రసాద్, ఘంటశాల బ్రహ్మజీ, రోటరీ సభ్యులు పాల్గొన్నారు. మొగల్తూరు మండ లంలోని మొగల్తూరు ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించి కరస్పాండెంట్ సెక్రటరీ ఆకన ఫణీంద్రనాథ్, ప్రిన్సిపాల్ ఆకన రవిచంద్ర బహుమతులు అందించారు.
భీమవరం ఎడ్యుకేషన్/భీమవరం, జనవరి 11 : ది భీమవరం ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం కేజీఆర్‌ఎల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, ఫార్మసీ కళాశాల, జూనియర్ కళాశాల, జీటీపీ మహిళా కళాశాలల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భీమవరం హాస్పిటల్ డాక్టర్ ఎండి గోపాలరాజు, డాక్టర్ జీవీఆర్ శాస్త్రి, చెరుకువాడ రంగసాయి, పోలిశెట్టి దాసులు పాల్గొన్నారు. సెయింట్ ఆన్స్ స్కూల్‌లో హెచ్‌ఎం జుబేదా అంజుమ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. భీమవరంలో 1980 రీయూనియన్ భీమవరం క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రికెట్ మ్యాచ్ బుధవారం ప్రారంభించారు. మాజీ రంజీ క్రీడాకారుడు మంగేష్ ఈ పోటీలను ప్రారంభించారు.
పాలకొల్లు అర్బన్/పాలకొల్లు రూరల్ : వీవర్స్ కాలనీలోని జీవీఎస్‌వీ ఆర్‌ఎం మున్సిపల్ పాఠశాలలో విద్యార్థుల వేషధారణలు ఆకట్టుకున్నారు. హెచ్‌ఎం భవానీ ప్రసాద్, ఉపాధాయులు త్రిమూర్తులు, చంద్రకళ, శశికళ, భవాని దుర్గ పాల్గొన్నారు. సన్ షైన్ స్కూల్, లయన్స్ క్లబ్‌లు సంయుక్తంగా సంక్రాంతి సంబరాలను లయన్స్ క్లబ్ భవనంలో ముఖ్యఅతిథిగా కారుమూరి రామలింగేశ్వరరావు ఆధ్వర్యం లో వేడుకగా నిర్వహిచారు. పాలకొల్లు రూరల్‌లోని ఆదిత్య విద్యాసంస్థల్లో డైరెక్టర్ ఎస్‌వీ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఎన్.అయ్యప్ప రాజు, వైస్ ప్రిన్సిపాల్ పీఆర్‌ఎస్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆచంట/పెనుగొండ : ఆచంట మండలం పెనుమంచిలిలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వాలీబాల్, కబడ్డీ టోర్నమెంట్ పోటీలు ప్రారంభించారు. కొడమంచిలి హోలి ఏంజెల్స్ స్కూల్‌లో, పెనుగొండ మండలంలోని పెనుగొండ శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ బి.బాలాజీ ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహించారు.
Updated Date - 2023-01-12T00:29:52+05:30 IST