ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అద్దె బస్సులు కావలెను

ABN, First Publish Date - 2023-04-06T00:25:49+05:30

జిల్లాలో ఆర్టీసీ కొత్తగా 11 బస్సులు అద్దె ప్రాతిపదికన ప్రవేశపెట్టేందుకు టెండర్లకు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఆసక్తిగల బిడ్డర్లు ఆర్టీసీ ఇ–కామర్స్‌ పోర్టల్‌ ఎంఎస్టీసీలో నమోదు చేసుకుని టెండరు దరఖాస్తులు పొందవచ్చు. బిడ్లను ఈనెల 5 తేదీ ఉదయం 5 నుంచి ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

టెండ ర్లకు ఆర్టీసీ ఆహ్వానం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఆర్టీసీ కొత్తగా 11 బస్సులు అద్దె ప్రాతిపదికన ప్రవేశపెట్టేందుకు టెండర్లకు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఆసక్తిగల బిడ్డర్లు ఆర్టీసీ ఇ–కామర్స్‌ పోర్టల్‌ ఎంఎస్టీసీలో నమోదు చేసుకుని టెండరు దరఖాస్తులు పొందవచ్చు. బిడ్లను ఈనెల 5 తేదీ ఉదయం 5 నుంచి ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. రివర్స్‌, టెండరింగ్‌ ప్రక్రియను వచ్చేనెల 3 ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు. అద్దె బస్సులు ప్రవేశపెట్టే రూట్లు, బస్సుల ప్రమాణాలు, ఇతర వివరాల కోసం ఆర్టీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వీరయ్య చౌదరి తెలిపారు. జిల్లాలో పల్లెవెలుగు 5, ఎక్స్‌ప్రెస్‌ 1, ఆలా్ట్ర పల్లెవెలుగు 4, స్లీపర్‌ నాన్‌ ఏసీ 1 బస్సులు అవసరమని అధికారులు ప్రకటించారు.

డిపోల వారీగా రూట్ల వివరాలు

భీమవరం డిపోకు 7 బస్సులు అవసరం కాగా పల్లె వెలుగు బస్సులు రెండు, భీమవరం నుంచి జంగారెడ్డిగూడెం రూట్‌లో నడిపేందుకు అలా్ట్ర పల్లె వెలుగు ఒకటి, భీమవరం నుంచి రాజమహేంద్రవరం రూట్‌కు 2, భీమవరం నుంచి ఏలూరు రూట్‌కు రెండు బస్సులు అవసరమని నిర్ణయించారు. భీమవరం నుంచి బీహెచ్‌ఈఎల్‌ నడిపేందుకు నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సు ఒకటి కావాల్సి ఉంది. నరసాపురం డిపోకు సంబంధించి నర్సాపురం నుంచి ఏలూరు రూట్‌లో నడిపేందుకు ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ ఒక బస్సు కావలసి ఉంది. తాడేపల్లిగూడెం డిపోకు సంబంధించి తాడేపల్లిగూడెం నుంచి జంగారెడ్డిగూడెం రూట్‌లో పల్లెవెలుగు సర్వీసుల కింద నడిపేందకు రెండు బస్సులు, తణుకు డిపోకు సంబంధించి తణుకు నుంచి రాజమహేంద్ర వరం రూట్‌లో పల్లెవెలుగు కింద నడిపేందుకు ఒక బస్సు అవసరం ఉందన్నారు. వివరాలకు మీ దగ్గరలోని డిపో మేనేజర్‌ కార్యాలయంలో తెలుసుకోవచ్చునని వీరయ్యచౌదరి తెలిపారు.

Updated Date - 2023-04-06T00:25:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising