19 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
ABN, First Publish Date - 2023-06-16T00:21:48+05:30
తెలంగాణ నుంచి అక్రమంగా ఆంధ్రాకు వస్తున్న రేషన్ బియ్యం లారీని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద బుధవారం రాత్రి విజిలెన్స్ అధికారులు వాహనాల తనిఖీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ నుంచి కాకినాడ పోర్టుకు లారీలో రేషన్ బియ్యం మూటలు కట్టి 19 టన్నుల (380 బస్తాలు) బియ్యం తరలి స్తుండగా అధికారులు తనిఖీల్లో గుర్తించి పట్టుకున్నారు.
జీలుగుమిల్లి, జూన్ 15 : తెలంగాణ నుంచి అక్రమంగా ఆంధ్రాకు వస్తున్న రేషన్ బియ్యం లారీని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద బుధవారం రాత్రి విజిలెన్స్ అధికారులు వాహనాల తనిఖీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ నుంచి కాకినాడ పోర్టుకు లారీలో రేషన్ బియ్యం మూటలు కట్టి 19 టన్నుల (380 బస్తాలు) బియ్యం తరలి స్తుండగా అధికారులు తనిఖీల్లో గుర్తించి పట్టుకున్నారు. నల్గొండకు చెందిన ఎస్‌కె.మీరావల్లి, ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పరిసర గ్రామాల్లో రేషన్ బియ్యం సేకరించి లారీలో లోడు చేసి కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారని అధికారులు తెలిపారు. బియ్యం విలువ రూ.3 లక్షల 42 వేలు, లారీ విలువ రూ.5 లక్షల 35 వేలు మొత్తం రూ.8.77 లక్షలుగా అధికారులు గుర్తించారు. సరుకు తరలిస్తున్న మీరావల్లీ, లారీడ్రైవర్ కూరపాటి గోపి, లారీ యజమాని వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేశారు. విజిలెన్స్ అధికారులు ఇన్ స్పెక్టరు పి.శివరామకృష్ణ, సీఎస్ డీటీ సురేంద్ర, వీఆర్వో బుల్లి అబ్బులు ఉన్నారు.
Updated Date - 2023-06-16T00:21:48+05:30 IST