ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాస్టల్‌లో ఆస్పత్రి

ABN, First Publish Date - 2023-03-20T00:04:09+05:30

మండలంలో గత ఏడాది జూలైలో గోదావరి వరదకు ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి.

వేలేరుపాడులో మూతపడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వేలేరుపాడు మండలంలో వరదలకు మునిగిన ఆస్పత్రి భవనాలు

ఆశ్రమ పాఠశాల.. తర్వాత హాస్టల్‌లో నిర్వహణ

వేలేరుపాడు, మార్చి 19: మండలంలో గత ఏడాది జూలైలో గోదావరి వరదకు ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి. ప్రజల ఇళ్లతో పాటు ప్రభుత్వ శాఖల భవనాలు వరదలో మునిగిపోయాయి. వరద తగ్గిన అనంతరం తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాలు, పోలీస్టేషన్‌, జూనియర్‌ కళాశాల, పాఠశాల భవనాలను శుభ్రం చేసి కార్యాకలాపాలను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను మాత్రం పడుకోబెట్టేశారు. వైద్య, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంతో ఆసుపత్రి భవనాలను శుభ్రం చేయించకుండా అలాగే వదిలే శారు. నేటికీ తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాల, హాస్టల్‌లో ఆస్పత్రి కార్య కలాపాలు నిర్వహిస్తున్నారు. వేలేరుపాడులోని ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతీరోజు 200 మంది వైద్య పరీక్షల కోసం వస్తారు. వైద్యశాలను వరదల సమయంలో తాత్కాలికంగా శివకాశీపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశా లలోని ఒక తరగతి గదిలో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పరీక్షల సమయం కావడంతో తిరిగి ఎర్రబోరు గ్రామంలోని ఎస్సీ హాస్టల్‌లో తాత్కాలికంగా వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. కొయిదా గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని కూడా వరదల సమయంలో ఖాళీ చేసి కాచారం ఆశ్రమ పాఠ శాలలో ఏర్పాటు చేశారు. నేటికీ కూడా అక్కడే వైద్య సేవలందిస్తున్నారు. ఈ భవనాన్ని కూడా పదేళ్ల క్రితమే అన్ని వసతులతో లక్షలాది రూపాయ లు వెచ్చించి నిర్మించారు. ప్రజలకు అన్ని విధాలా అందుబాటులో ఉన్న పాత ఆసుపత్రి భవనాలను ఖాళీ చేసి తాత్కాలికంగా ఏర్పాటుచేసుకున్న వైద్య శాలలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేందుకు చుట్టు పక్కల గ్రామాలకు అత్యంత అనుకూలంగా ఉండేది. ప్రస్తుతం ఎర్రబోరులో ఏర్పాటు చేసిన వైద్యశాలకు వెళ్లాలంటే కొంత వ్యయ ప్రయాసలు తప్పవు. వెళ్లలేని వారు ఆర్‌ఎంపి వైద్యుల వద్దకు వెళ్తున్నారు. వరదలకు ఆసుపత్రి భవనాల్లో బురద, మట్టి పేరుకుపోవడంతో ఇప్పటివరకు శుభ్రం చేయించలేదు. ఉన్నతాధికారుల సూచనలతో ప్రస్తుతం ఇలానే కొనసాగిస్తున్నామని వైద్యు లు అంటున్నారు. మండలంలోని మిగతా ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ సంబంధిత శాఖాధికారులకు శుభ్రం చేయించుకోగా ప్రభుత్వ ఆసుపత్రి భవనాలను శుభ్రం చేయించడానికి జిల్లా అధికారులు నిధులు విడుదల చేయకపోవడమే కారణమని తెలుస్తోంది.

ప్రజలను తరలించాల్సి ఉందని..

వరదలకు దెబ్బతిన్న ప్రభుత్వ ఆసుపత్రి భవనాల్లో వైద్య సేవలందించే అవకాశం లేదు. మండలంలోని రెండు ప్రభుత్వాసుపత్రులు, కుక్కునూరు లో ఆసుపత్రిని తాత్కాలికంగా పాఠశాల భవనాల్లో నిర్వహిస్తున్నాం. ఆస్ప త్రి భవనాల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాం. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కాలనీలకు తరలించాల్సి ఉంది. ఆయా ప్రాంతాల్లో పీహెచ్‌సీ భవనాలు నిర్మాణంలో ఉన్నందున త్వరలోనే అక్కడ వైద్య సేవలందిస్తాం. అంతవరకు ప్రస్తుతం నిర్వహిస్తున్న తాత్కాలిక కేంద్రాల్లోనే వైద్య సేవలు నిర్వహించాల్సిందిగా అధికారులు సూచించారు.

– డాక్టర్‌ రాజీవ్‌, ఎస్‌పీహెచ్‌వో

Updated Date - 2023-03-20T00:04:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising