ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిజియోథెరపీతో పేషెంట్ల పాట్లు

ABN, First Publish Date - 2023-06-11T01:26:45+05:30

మెడికల్‌ కాలేజీకి అనుమతి రావడంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రిని ప్రభుత్వ సర్వజనాస్పత్రిగా మార్చేశారు. ఇప్పటికే ఆస్పత్రికి రంగులను వేసి ఆయా విభాగాలకు బోర్డులను ఏర్పాటుచేశారు. ఫిజియోథెరపీ యూనిట్‌ పరిస్థితి ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టు ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, జూన్‌ 10: మెడికల్‌ కాలేజీకి అనుమతి రావడంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రిని ప్రభుత్వ సర్వజనాస్పత్రిగా మార్చేశారు. ఇప్పటికే ఆస్పత్రికి రంగులను వేసి ఆయా విభాగాలకు బోర్డులను ఏర్పాటుచేశారు. ఫిజియోథెరపీ యూనిట్‌ పరిస్థితి ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. ఫిజియోథెరపీ యూనిట్‌కు నిత్యం 45 నుంచి 50 మంది రోగులు వస్తున్నారు. ఇటీవల బీపీ, షుగర్లు పెరగడం వాటిని గుర్తించేలోపే తలలో రక్తనాళాలు చిట్లి పక్షవాతానికి గురవుతు న్నారు. ఇలాంటి వారు మందులు వాడడంతోపాటు ఫిజియోథెరపీ చేయించుకోవాలి. వివిధ ప్రమాదాల్లో కాళ్లు, చేతులు విరిగిన వారు, వెన్నుపూస అరిగిన వారు, మెడ వద్ద భుజలు అరి గిన వారు, నరాలు బలహీనత ఉన్నవాళ్లు ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిందే. ఆర్థరైటిస్‌, స్పాండిలైటిస్‌, పక్షవాతం, మూతి వంకర వచ్చిన వారు ఫిజియోథెరపీ చేయించు కోవాల్సి ఉంటుంది. ఫిజియోథెరపీకి అవసరమైన మెడికల్‌ కేబుల్స్‌ (వైద్య పరికరాల వైర్లు)లేక అక్కడకు వచ్చే రోగులు గంటల తరబడి ఉండాల్సి ఉంటుంది. ఏకకాలంలో ఏడుగురికి ఫిజియోథెరపీ చేయడానికి అవసరమైన పాత సామగ్రి ఉన్న వాటి మెడికల్‌ కేబుల్స్‌ లేక నాలుగు మిషన్లు ఉపయోగం లేకుండాపోయాయి. కేవలం మూడు మిషన్లతో మాత్రమే చేస్తున్నారు. ఒక్కొక్కరికి అర గంట నుంచి 40 నిముషాల వరకూ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఇక్కడ ఫిజియోథెరపీ చేయించుకోవడానికి వచ్చిన వారు అంత సమయం ఉండలేక ఇంటిముఖం పడుతున్నారు. ఇక్కడ పడిగాపులు పడేబదులు ఇంటిలో వేడిచేసిన ఉప్పును వస్త్రంలో వేసి మసాజ్‌ చేసుకుంటామంటూ ఆవేదనగా చెబుతున్నారు. వీరి సమస్యను ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు చెబుదామన్నా ఆయన ఛాంబర్‌లోకి ఎవ్వరిని లోనికి రానివ్వరనే ప్రచారం ఉంది. వారి సమస్యను పట్టించుకునే నాథుడే లేడు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, రోగులపై మానవతా దృక్ఫథంతో ఆలోచించి తక్షణం మెడికల్‌ కేబుళ్లను ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు. గత ఆరు నెలల నుంచి ఈ సమస్య ఇదే విధంగా ఉన్నప్ప టికీ ఎవరు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా మెడికల్‌ కాలే జీకి అనుబంధంగా ఉన్న టీచింగ్‌ ఆస్పత్రిలో సదుపాయాలు తక్షణం కల్పించాల్సి ఉంటుంది.

Updated Date - 2023-06-11T01:26:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising