మణిపూర్ దుశ్చర్య సమాజానికి మచ్చ
ABN, First Publish Date - 2023-07-21T23:49:29+05:30
మణిపూర్‌లో ఆదివాసీ మహిళలపై హింస దృశ్చర్యలు భారతీయ సమాజానికి మచ్చ అని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్ముల సురేష్ అన్నారు.
జంగారెడ్డిగూడెం టౌన్, జూలై 21 : మణిపూర్‌లో ఆదివాసీ మహిళలపై హింస దృశ్చర్యలు భారతీయ సమాజానికి మచ్చ అని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్ముల సురేష్ అన్నారు. గిరిజన మహిళలపై హింసను వ్యతి రేకిస్తూ శుక్రవారం వెట్టి సుబ్బన్న అధ్యక్షతన ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సురేష్ మాట్లాడుతూ మణిపూర్‌లో బీజేపీ ఓట్ల కోసం మెజార్టీ వర్గాన్ని రెచ్చగొట్టి ఆదివాసీలపై దాడులు చేపిస్తున్నారని విమర్శిం చారు. ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అక్కడి ఆదివాసి గిరిజను లపై దాడులు చేపిస్తున్నారని ఆరోపించారు. దాడులు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుందన్నారు. 15 ఏళ్ల బాలుడి తల నరికి ఊరేగించడం అక్కడి దమనకాండకు అద్దం పడుతుందన్నారు. పోలీసు రక్ష ణలో ఉన్న ముగ్గురు మహిళలను వివస్త్రలుగా ఊరేగించి అత్యాచారం చేసి చంపడం అత్యంత దారుణమన్నారు. ప్రజలందరూ మతోన్మాదానికి వ్యతిరే కంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పి.శ్రీనివాస్, కెవి.రమణ, పీవోడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు వెట్టి భారతి, డి.లక్ష్మి, పివైఎల్ నాయకులు తగరం బాబురావు, కె.రామలక్ష్మి, టి.సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు టూటౌన్: మణిపూర్‌లో గిరిజన మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి షేక్ భాష అన్నారు. రైతు కూలీ ఆధ్వర్యంలో పాతబస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. మణిపూర్‌లో రెండు నెలలుగా ఉద్రిక్త వాతావరణం నెలకొనడా నికి బీజేపీ మతత్త్వ రాజకీయాలే కారణమన్నారు. మణిపూర్‌లో 150మందికి పైగా చనిపోయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం దుర్మార్గమ న్నారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను తక్షణం శిక్షించాలని అన్నారు.
Updated Date - 2023-07-21T23:49:29+05:30 IST