ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆన్‌లైన్‌ లింక్‌ ఓపెన్‌ చేస్తే.. సొమ్ములు మాయం

ABN, First Publish Date - 2023-08-22T00:00:06+05:30

: ఆన్‌లైన్‌ ద్వారా లింక్‌ ఓపెన్‌ చేసుకుని క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు వన్‌టౌన్‌ సర్కిల్‌ సీఐ రాజశేఖర్‌ కేసు నమోదు చేశారు.

ఏలూరు క్రైం, ఆగస్టు 21 : ఆన్‌లైన్‌ ద్వారా లింక్‌ ఓపెన్‌ చేసుకుని క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు వన్‌టౌన్‌ సర్కిల్‌ సీఐ రాజశేఖర్‌ కేసు నమోదు చేశారు. ఏలూరు సత్యనారాయణపేటకు చెందిన వాసంశెట్టి సతీష్‌ ఆన్‌లైన్‌ ద్వారా ఒక లింకును ఓపెన్‌ చేశారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే ఎక్కువ సొమ్ము వస్తుందని ఉండడంతో ఆ లింకు ద్వారా వాట్సప్‌లో చాటింగ్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఐదు వేలు పెట్టుబడి పెట్టాలని సూచించడంతో ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాడు. మళ్లీ రూ.34 వేలు కట్టాలని సూచించడంతో ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాడు. అవి రావాలంటే 48 వేలు కట్టాలని సూచించడంతో మళ్లీ కట్టాడు. కట్టిన సొమ్ము ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో తాను మోసపోయానని బాధితుడు గ్రహించి ఏలూరు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రాజశేఖర్‌ ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-08-22T00:00:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising