ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యువకుడి అదృశ్యం

ABN, First Publish Date - 2023-09-04T00:07:53+05:30

చిన్నాగిరిపల్లి శివారు సింగన్నగూడెం నుంచి అన్నవరపు శివబాబు (30) అనే వ్యక్తి అదృశ్యమైనట్టు ఆదివారం అతని బావమరిది ఆగిరిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆగిరిపల్లి, సెప్టెంబరు 3 : చిన్నాగిరిపల్లి శివారు సింగన్నగూడెం నుంచి అన్నవరపు శివబాబు (30) అనే వ్యక్తి అదృశ్యమైనట్టు ఆదివారం అతని బావమరిది ఆగిరిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదిదారు సోదరి శిరీషను కొండపల్లి గ్రామానికి చెందిన శివబాబుకు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు. శివబాబు వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో శిరీష తల్లిదండ్రులు వీరిని సింగన్నగూడెంలో తమ ఇంటికి తీసుకువచ్చి ఇక్కడే ఉంచుకుంటున్నారు. శివబాబు నెక్కలం గొల్లగూడెంలో ఓ బేకరీలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 1వ తేదీ ఉదయం విధులకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడని, అయితే ఆ రోజు అతను డ్యూటీకి వెళ్లలేదని షాపు యజమాని చెప్పారని, బంధువుల ఇళ్లలో, చుట్టుపక్కల గాలించినా అతని జాడ తెలియక పోవడంతో శిరీష కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌ కేసు నమోదు చేయగా ఎస్సై చంటిబాబు గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2023-09-04T00:07:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising