సార్వా నాట్లు ప్రారంభం
ABN, First Publish Date - 2023-07-13T00:00:28+05:30
కాళ్ల మండలంలో సార్వా నాట్లు ప్రారంభమయ్యాయి. అధికారుల సూచనల మేరకు జూన్ నెలాఖరుకు నారుమడులు వేయడంతో పాటు జూలై నెలలో పలు గ్రామాల్లో నాట్లు వేస్తున్నారు.
కాళ్ళ, జూలై 12 : కాళ్ల మండలంలో సార్వా నాట్లు ప్రారంభమయ్యాయి. అధికారుల సూచనల మేరకు జూన్ నెలాఖరుకు నారుమడులు వేయడంతో పాటు జూలై నెలలో పలు గ్రామాల్లో నాట్లు వేస్తున్నారు. మండలంలో సుమారు 4,500 ఎకరాల్లో సార్వా సాగు జరుగుతుంది. ఇప్పటికే కోపల్లె, వేంపాడు, జక్కరం తదితర గ్రామాల్లో నాట్లు వేస్తున్నారు. మిగిలిన గ్రామాల్లో కూడా నాట్లు వేసేందుకు చేలను దమ్ము చేసే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. దొడ్డనపూడి, కాళ్ళ గ్రామాల్లో ప్రతీ ఏడాది మాదిరిగానే కొందరు రైతులు వెదజల్లే పద్ధతి ద్వారా వరి సాగుకు సమాయాత్తం అవుతున్నారు. దీనిలో భాగంగా గ్రామంలో ఏడు ఎకరాల్లో వెదజల్లారు. ఈ ఏడాది సార్వా సాగుకు ఎంటీయూ 1061, 1318 రకాలతో పాటు స్వర్ణ సంపత్ రకాల వరి వంగడాలను రైతులు సాగు చేస్తున్నారని ఏవో సీహెచ్ జయవాసుకి తెలిపారు.
Updated Date - 2023-07-13T00:00:28+05:30 IST