ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందరం ఓటేద్దాం

ABN, First Publish Date - 2023-01-26T00:02:21+05:30

ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరం ఓటేద్దామని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.

కె.కోటలో మానవహారం నిర్వహిస్తున్న ఉద్యోగులు, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాతీయ ఓటరు దినోత్సవ ర్యాలీ, ప్రదర్శనలు

ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరం ఓటేద్దామని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లాలో పలుచోట్ల బుధవారం అవగాహన ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు నమోదు చేయించుకోవాలన్నారు. ఓటింగ్‌లో యువత తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. పలుచోట్ల సీనియర్‌ ఓటర్లను సత్కరించారు.

ఏలూరు టూటౌన్‌, జనవరి 25: ప్రలోభాలకు గురికాకుండా ఓటుహక్కు వినియోగించుకోవాలని జడ్పీ సీఈవో రవికుమార్‌ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటరు చైతన్య మాలిక కరపత్రాన్ని బుధవా రం ఆయన ఆవిష్కరించారు. అంబేడ్కర్‌ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మెండెం సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ నోట్లు తీసుకుని ఓట్లు వేస్తే అభివృద్ధికి చేటన్నారు. అనంతరం అవార్డు అందుకున్న జడ్పీ సీఈవో రవికుమార్‌ను సన్మానించారు. కే.బాబూరావు, ఎల్లా ఏసేబు, ఎన్‌.నాగార్జున, కిరణ్‌కుమార్‌, దినేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు ఎడ్యుకేషన్‌: కోటదిబ్బ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఓటరు దినోత్సవంలో ప్రిన్సిపాల్‌ గిరిబాబు మాట్లాడుతూ ఓటింగ్‌లో యు వత పాల్గొనాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతీఒక్కరు ఓటరుగా నమోదు కావాలని సూచించారు. విద్యార్దులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేత లకు బహుమతులు అందజేశారు. పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.

దెందులూరు: దేశాభివృద్ధికి ఓటు కీలకమని తహసీల్దార్‌ వి నాంచార య్య అన్నారు. దెందులూరు డీఈడీ కాలేజీ విద్యార్థులు ఓటు ప్రాధాన్యంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. లైబ్రరీ సెంటర్‌లో ఓటు హక్కుపై ప్రద ర్శన చేశారు. కరస్పాండెంట్‌ సుగ్గిశెట్టి నూకరాజు, ఎంఈవో సీహెచ్‌ బుధవ్యాస్‌, తదితరులు పాల్గొన్నారు.

కామవరపుకోట: తహసీల్దార్‌ కార్యాలయం వద్ద జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి గుర్తింపు కార్డులను అందజేశారు. ఎక్కువసార్లు ఓటు హక్కు వినియోగించుకున్న వారిని సత్కరించారు. గ్రామంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. కార్య క్రమంలో తహసీల్దార్‌ డీవీ.సత్యనారాయణ, డీటీ శేషగిరి, ఆర్‌ఐ కె.మానస, వీఆర్వోలు, వీఆర్‌ఏలు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామా ల్లో వీఆర్వోలు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు.

Updated Date - 2023-01-26T00:02:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising