ఉత్తమ ప్రదర్శన ‘నాన్నా.. నేనొచ్చేస్తా’..
ABN, First Publish Date - 2023-05-02T00:35:51+05:30
కొంతేరు యూత్‌క్లబ్ నాటక పరిషత్ 41వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన అఖిల భారతస్థాయి నాటికల పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి.
యలమంచిలి, మే 1: కొంతేరు యూత్‌క్లబ్ నాటక పరిషత్ 41వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన అఖిల భారతస్థాయి నాటికల పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఉత్తమ ప్రదర్శనగా శ్రీఅమృతలహరి థియేటర్ ఆర్ట్స్ గుంటూరు వారి ‘నాన్నా.. నేనొచ్చేస్తా’, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా శ్రీసాయిఆర్ట్స్ కొలకలూరు వారి ‘ప్రేమతో నాన్న..’, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా కళాంజలి హైదరాబాద్ వారి ‘రైతే రాజు’ ఎంపికైనట్లు పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు అంబటి మురళీకృష్ణ, గంటా ముత్యాలరావు తెలిపారు. ఉత్తమ ప్రదర్శనలు, దర్శక, రచయిత, నటులకు జ్ఞాపిక, బహు మతులను ఏఎంసీ మాజీ ఛైర్మన్ ఉన్నమట్ల కబర్ధి అందజేశారు. నాటికలు సమాజ చైతన్యానికి ప్రతీకలు అని పేర్కొన్నారు. గంటా ముత్యాలరావు, ఉపాఽ ద్యక్షులు బోణం రవిబాబు, జక్కంశెట్టి సుబ్రహ్మణ్యం, కోశాధికారి అంబటి నవీన్‌చంద్, బోడపాటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-05-02T00:35:51+05:30 IST