మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
ABN, First Publish Date - 2023-09-23T00:18:51+05:30
ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా అధ్యక్షుడు కూనపాముల విఘ్నేశ్వరరావు డిమాండ్ చేశారు.
జంగారెడ్డిగూడెం, సెప్టెంబరు 22: ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా అధ్యక్షుడు కూనపాముల విఘ్నేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా శుక్రవారం పాత మున్సిపల్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమి షనర్ పి.భవానీ ప్రసాద్‌కు వినతి పత్రంను అందజేశారు. మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పాత పెన్షన్ విధా నాన్ని కొనసాగించాలని, కరోనా సమయంలో చనిపోయిన మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా ఇచ్చి, వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని, ఇళ్లస్థలం కేటాయించి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండల కార్యదర్శి కుంచె వసంతరావు, జేవీ రమణరాజు, యూనియన్ పట్టణ అధ్యక్షుడు కొత్తూరి నాగేశ్వరరావు, కార్యదర్శి బొక్కా శ్రీనివాసరావు, ఇంగుర్తి నాగేశ్వరరావు, రేలంగి నాగరాజు, వీరప్రసాద్, కొత్తూరి శ్రీను పాల్గొన్నారు.
ఏలూరు రూరల్: ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిం చారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు భజంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాల్టీ, నగర పంచాయతీ, కార్పొరేషన్ రంగాల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికులను క్రమబద్దీకరిస్తామని సమ్మె చేస్తే ఏడాది పూర్తి అయినా పరిష్కారం కాలేదని పర్మినెంట్ కార్మికులకు జీపీఎఫ్ ఖాతాలు ప్రారంభించలేదన్నారు. వై దుర్గా రావు, నాగబాబు, దుర్గా ప్రసాద్, వెంకన్నబాబు, డి.ఉమ, తదితరులు పాల్గొన్నారు.
కోటదిబ్బ ఎస్‌ఆర్ 1 వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేప ట్టారు. జిల్లా కన్వీనర్ బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్, ఉద్యోగ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామని మాట తప్పిందని చెప్పారు. సుబ్బారావు, సీహెచ్ హరినాథబాబు, ఎన్.అశోక్, దుర్గా ప్రసాద్, టి.రామారావు, దుర్గారావు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-23T00:18:51+05:30 IST