ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అమ్మో.. దోమ !

ABN, First Publish Date - 2023-08-20T00:34:21+05:30

ఉమ్మడి జిల్లాలోని ఏలూరు నగరంతో పాటుగా అన్నిపట్టణాలు, గ్రామాల్లో ఇప్పుడు దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. విచ్చలవిడిగా మానవ రక్తం తాగే స్తున్నాయి. దోమలు సంఖ్య నానాటికీ పెరుగుతున్నప్పటికీ స్ధానిక సంస్ధల అధికారులు తమనేమి దోమలు కుట్టవన్న మొండి దైర్యంతో వ్యవహరిస్తున్నారు.

పట్టణాల్లో క్షీణిస్తున్న పారిశుధ్యం

పూడుకుపోతున్న డ్రెయిన్లు

చిత్తడి ప్రాంతాల్లో మురుగునీటి నిల్వలు

పెరిగిపోతున్న దోమల సంతతి

నిర్మూలనకు చర్యలు శూన్యం

వర్షాకాలం వచ్చిందంటే ఏజెన్సీలో హడల్‌

ఏటా వందల సంఖ్యలో జ్వర పీడితులు

నేడు ప్రపంచ దోమల నివారణ దినం

జంగారెడ్డిగూడెం/పాలకొల్లు ఆగస్టు 19 : ఉమ్మడి జిల్లాలోని ఏలూరు నగరంతో పాటుగా అన్నిపట్టణాలు, గ్రామాల్లో ఇప్పుడు దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. విచ్చలవిడిగా మానవ రక్తం తాగే స్తున్నాయి. దోమలు సంఖ్య నానాటికీ పెరుగుతున్నప్పటికీ స్ధానిక సంస్ధల అధికారులు తమనేమి దోమలు కుట్టవన్న మొండి దైర్యంతో వ్యవహరిస్తున్నారు. సాదారణంగా ప్రతీ ఏటా వేసవిలో డ్రైన్లలో మురుగు తీస్తారు. చిత్తడి ప్రాంతాల్లో గుంటలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వర్షాకాలం ఆరంభమైన వెంటనే ప్రధాన డ్రైన్లలో గంభూసియా చేపలను వదులుతారు. ఈ చేపలు దోమ లార్వాలను వెంటనే తినేస్తాయి. దీంతో దోమలు పునరుత్పత్తి తగ్గుతుంది అయితే ఉమడి జిల్లాలోని పట్టణాల్లో మూడింటి ఒక శాతం మాత్రమే షిల్టు తొలగించారు. కొద్దిపాటి వర్షాలకే డ్రైన్లు పొంగి మురుగునీరు రోడ్లమీదకు వస్తుంది. దీంతో దోమలు ఉత్పత్తి పెరుగుతోంది. జిల్లాలోని పట్టణాల్లో ఆయా పురపాలక సంఘాలులో దోమలు నిర్మూలనకు ఖర్చు చేస్తున్న లక్షలాది రూపాయలు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

చినుకు పడితో ఏజెన్సీ వణుకు

చినుకు పడితే ఏజెన్సీ వాసులు జ్వరాల భయంతో వణికిపోతారు. ఏటా వర్షాకాలంలో వైరల్‌ ఫీవర్‌లతో పాటు మలేరియా, డెంగ్యూ, విష జ్వరాలతో ఇక్కడ ప్రజలు అల్లాడి పోతుంటారు. మన్యం అంతా పడకేస్తుంది. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ ఉండాల్సిందే. సీజన్‌లో పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా, డెంగ్యూలతో పాటు సాధారణ జ్వరాలు విజృంభిస్తాయి. ప్రతీ ఏటా వందల సంఖ్యలో మలేరియా కేసులు నమోదవు తున్నాయి. ప్రాణాలను హరించే ప్రమాదకరమైన మలేరియా జ్వరం కొండరెడ్డి, గిరిజనులకు శాపంగా మారింది. కోట్లాది రూపాయలను ఖర్చు చేసి నివారణ చర్యలు చేపడుతున్నా మలేరియా మాత్రం ఏటా తన ప్రతాపాన్ని చూపుతోంది. ఏజెన్సీలోనే ప్రతీ ఇంటికి ఒకరిద్దరు జ్వరాలకు గురవుతారు. జిల్లాలో అత్యధి కంగా ఏజెన్సీలోనే మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏటా జిల్లా వ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో 90 శాతానికి పైగా ఏజెన్సీ ప్రాం తంలోనే నమోదవుతున్నాయి.అధికారులు కూడా నివారణ చర్యలు తూతూ మంత్రంగానే జరుపుతు న్నారనే ఆరోపణలు ఉన్నాయి. మలేరియాతో పాటు డెంగీ కేసులు కూడా అధికమే. డెంగీ జ్వరం వస్తే పూర్తిగా నీరసించి పోయి ప్లేట్‌లెట్స్‌ పడిపోయి ప్రాణాపాయ స్ధితికి చేరుతుంటారు. ఈ క్రమంలోనే ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయించి వేలాది రూపా యలు బిల్లుల రూపంలో చెల్లిస్తున్నారు. పశ్చిమ ఏజెన్సీపైనే ఆధారపడి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎన్నో ఆసుపత్రులు కళకళలాడుతున్నాయి. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) ఉన్నాయి. వీటిలో బుట్టాయిగూడెం, పోలవరం గ్రామాల్లో సామాజిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు.

చిన్న దోమే కదా అని చులకన వద్దు

ఈ ఫోటోలో కన్పిస్తున్న దోమ ఆడ ఎనాఫిలస్‌. ఇది ప్రాణాంతకమైన మలేరియా జ్వరాన్ని ఇట్టే మనకు అంటిస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలోని చెట్లు, చెట్ల ఆకులు, రాలిన ఆకుల చెత్తలపై, కొండ వాగులు, మురికిగుంటల వద్ద ఇవి ఎక్కువగా ఉంటాయి. మలేరియా వ్యాప్తికి కారకాలైన పరాన్నజీవులను మానవ శరీరంలోకి ఎక్కిస్తుంది. ఒక్కసారి కుడితే చాలు దాని ప్రభావం ప్రమాదకరం. మలేరియా జ్వరం వచ్చిన వారు మొదటిలోనే గుర్తించి వైద్యం పొందకపోతే అది మెదడుకి పాకి ప్రాణాలను హరిస్తుంది.

ప్రమాదకరం డెంగీ

దోమ కాటు కారణంగా ప్రమాదకరమైన మలేరియా, డెంగీ, మెదడు వాపు, చికున్‌గున్యా, బోధకాలు వంటి వ్యాఽధులు వస్తాయి. ఏడీస్‌ అనే దోమ కాటుకు గురైతే డెంగీ తప్పదు. ఇది ఉదయం పూట కాటు వేస్తుంది. ఇది 14 రోజుల నుంచి మూడు వారాల వరకు జీవిస్తుంది. ఇది ఎంతో ప్రమాదకరమైంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి ఉంటుంది. కీళ్ళనొప్పులు, ఒళ్ళు నొప్పులు, చర్మంపై ఎర్రని దద్దుర్లు, నోరు ఎండిపోవడం. అధికదాహం వంటి లక్షణాలు ఉంటాయి.

నివారణ చర్యలు ఏవీ

లార్వా దశలోనే దోమలను నిర్మూలించగలిగితే వాటి బెడద ఉండదు. అయితే ప్రభుత్వాలు స్ధానిక సంస్ధలు సంబంధిత అధికారులు నివారణ చర్యలపై దృష్టి పెట్టడం లేదు. తక్కువ ఖర్చుతో కూడిన గంభూసియా చేపల తయారీ కేంద్రాల్లో వాటిని సేకరించి డ్రైన్లలో వదిలే పక్రియకు సైతం చరమగీతం పాడారు. ఇంటి పరిసరాలలో దోమలు పెరిగేందుకు దోహదపడే మురికి నీటి నిల్వలను తొలగించాలి. తాగి పారవేసిన కొబ్బరి బొండాలను ముక్కలుగా చేసి దూరంగా పారేయాలి. ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, నీటి నిల్వ పాత్రలను, డ్రమ్ము లను పూర్తిగా ఖాళీ చేసి శుభ్రం చేసుకోవాలి. కాల్వల్లో వ్యర్థ్ధాలు, చెత్త, చెట్ల కొమ్మలు వేయరాదు. వారానికి ఒకసారి పూలతొట్టెల్లో, పూలకుండీల్లో నీరు మార్చాలి. దోమలు లోపలకి రాకుండా జాగ్రత్త పడాలి. దోమ తెరలు వాడాలి. దోమలు వృద్ది చెందడానికి పరిసరాలు అపరిశుభ్రతే కారణమని వెద్యులు చెబుతున్నారు. పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్యం లోపించింది. ఏజెన్సీలో డ్రైనేజీ వ్యవస్థలు లేకపోవడం, పంచాయతీలకు ఆదాయం తక్కువగా ఉండటం వల్ల అక్కడ పారిశుధ్య పనులు అంతంత మాత్రంగానే సాగిస్తున్నారు. పట్టణాల విషయానికొస్తే ఇళ్ల మధ్యలో ఉండే ఖాళీ స్థలాలను దోమలు ఆవా సాలుగా ఏర్పాటు చేసుకుంటున్నాయి. మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు పెరిగి పందులు అక్కడే దొర్లడంతో వ్యాధులు ప్రభలుతున్నాయని పట్టణ ప్రజలు వాపోతున్నారు.

జ్వరమొస్తే జేబులు ఖాళీ

మలేరియా, డెంగీ జ్వర పీడితులు ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్తే దోపిడీకి గురవుతున్నారు. మలే రియా జ్వర పీడితులు వారం రోజుల పాటు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందితే దాదాపు రూ.10 వేలు నుంచి రూ.15 వేలు వసూలు చేస్తున్నట్టు చెబుతు న్నారు. వీటికి అదనంగా ఎక్కడ లేని మందులు రాసేస్తున్నారు. అవికూడా ఆసుపత్రిలోనే కొనుక్కోవాలి. ఇక డెంగీ జ్వర పీడితుల్లో ప్లేట్‌లెట్స్‌ తగ్గాయని దాదాపు రూ.40 వేలు పైనే గుంజుతున్నట్టు చెబుతున్నారు.

ఏజెన్సీలో మలాథియాన్‌ పిచికారీ

మలేరియా నివారణకు 2021వ సంవత్సరంలో 2.52 లక్షల దోమ తెరలను వైద్య శాఖాధికారులు పంపిణీ చేశారు. 2022లో ఒక లక్ష గంబూషియా చేపలను పాతపడిన బావులు, దోమలు పెరిగే ప్రాంతాల్లో విడిచి పెట్టారు. బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగు మిల్లి మండలాల్లో 91 మలేరియా ప్రభావిత ప్రాంతా లను గుర్తించి రెండు దఫాలుగా మలాథియాన్‌ స్ర్పేయింగ్‌ చేయించారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 36 మలేరియా ప్రభావిత ప్రాంతాలను గుర్తించి మొదటి విడత మలాథియాన్‌ స్ర్పేయింగ్‌ చేశారు.

Updated Date - 2023-08-20T00:34:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising