నేటి నుంచి ఓటర్ల జాబితా పరిశీలన
ABN, First Publish Date - 2023-07-21T00:22:56+05:30
జిల్లావ్యాప్తంగా ఈ నెల 21 నుంచి నెల రోజులపాటు ఇంటింటా ఓటర్ల జాబితా పరిశీలన చేపట్టనున్నట్టు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వై.ప్రస న్నవెంకటేశ్ తెలిపారు.
సర్వేలో వలంటీర్లు పాల్గొనరు : కలెక్టర్
ఏలూరు సిటీ, జూలై 20 : జిల్లావ్యాప్తంగా ఈ నెల 21 నుంచి నెల రోజులపాటు ఇంటింటా ఓటర్ల జాబితా పరిశీలన చేపట్టనున్నట్టు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వై.ప్రస న్నవెంకటేశ్ తెలిపారు. ఓటరు జాబితా సవరణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో గురు వారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు సమగ్ర ఓటరు సర్వే ప్రక్రియను బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తారు. ఈ దృష్ట్యా దోషరహిత, పారదర్శకంగా ఓటరు జాబితా రూపకల్పనకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు సహకరించాలి. అర్హత ఉన్న వారికి ఓటు హక్కు కల్పించేందు కు ఫారం–6, తొలగింపునకు ఫారం–7, మార్పుల కోసం ఫారం– 8 ద్వారా మార్పుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. మృతి చెందిన లేదా శాశ్వతంగా ఇతర ప్రాంతా లకు వలస వెళ్లిన వారి వివరాలను ఇంటింటా సర్వేలో నమోదు చేస్తారు. సర్వేలో వలంటీర్లు పాల్గొనరు. బూత్ లెవెల్ అధికారులు స్వీకరించిన వివరా లను ప్రతి మంగళవారం నియోజక వర్గ స్థాయిలో, ప్రతి బుధవారం జిల్లా స్థాయిలో పరిశీలిస్తారు. పోలవరం నిర్వాసితుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి అర్హులందరినీ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకు న్నాం. ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు బీఎల్‌వోల ద్వారా ఇంటింటికీ ధ్రువీకరణ, 22 నుంచి సెప్టెంబరు 29 వరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునఃఏర్పాట్లు ఫొటోగ్రాఫ్ ప్రక్రియ, సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 16 వరకు ఫార్మెట్–1 నుంచి 8 వరకు తయారీ, 2024 జనవరి 1వ తేదీ అర్హత తేదీగా సూచించే సప్లిమెంట్స్, ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ ఎలకో్ట్రరల్ రోల్ ప్రచురణ, అక్టోబరు 17 నుంచి నవంబరు 30 వరకు ఓటరు జాబితాపై ఫిర్యాదులను స్వీకరిస్తామ’ని చెప్పారు. డిసెంబరు 26న దావా లు, అభ్యంతరాలు తొలగింపు, 2024 జనవరి 1న ఓటర్ల జాబి తాను తనిఖీ చేసి తుది ప్రచురణ కోసం ఎన్నికల కమిషన్ అనుమతి, 2024 జనవరి 5న ఓటర్ల జాబితా తుది ప్రచురణ జరుగుతుంది. పాలి ప్రసాద్(టీడీపీ), బొద్దాని శ్రీనివాస్ (వైసీపీ), ఆర్.రామ్మోహనరావు(కాంగ్రెస్), సిర్రా భరత్ (బీ ఎస్పీ), నెరుసు నెలరాజ(బీజేపీ), పి.కిశోర్ (సీపీఎం), పాల్గొన్నారు.
Updated Date - 2023-07-21T00:22:56+05:30 IST