ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మద్యం కక్కుర్తి

ABN, First Publish Date - 2023-09-22T00:16:44+05:30

వైసీపీ అధిష్ఠానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం దుకాణాలు కేంద్రంగా ఈ ప్రజా దోపిడీకి లైసెన్స్‌లు ఇచ్చి మరీ వ్యాపారం చేయిస్తున్నారు. అడ్డు చెప్పాల్సిన అధికారులు నోళ్లు కుట్టేసుకున్నారు.

అమ్మకాలు ఘనం – బిల్లులు మాయం

మార్కెట్లో విరివిగా యానాం మద్యం

వినియోగదారుల ఫోరం సూచనలు బేఖాతర్‌

కల్తీ మద్యానికి భేషైన ఆస్కారం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

విచ్చలవిడిగా అమ్మేస్తారట.. కానీ బిల్లులు ఇవ్వరు!

కోట్లల్లో వ్యాపారం చేస్తారే తప్ప, రశీదులు అడక్కూడదు !

వినియోగదారుల ఫోరం హెచ్చరికలను

ఖాతరు చేయరు !

– ఇదీ ఏలూరు జిల్లాలో మద్యం అమ్మకాల తీరు. కొను గోలు దారుల జేబులతోపాటు వారి ఆరోగ్యాన్ని కొల్లగొడుతు న్న సర్కారీ మద్యం ఎన్నో కుటుంబాలను రోడ్డు పాల్జేస్తోంది. వైసీపీ అధిష్ఠానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం దుకాణాలు కేంద్రంగా ఈ ప్రజా దోపిడీకి లైసెన్స్‌లు ఇచ్చి మరీ వ్యాపారం చేయిస్తున్నారు. అడ్డు చెప్పాల్సిన అధికారులు నోళ్లు కుట్టేసుకున్నారు. జిల్లాలోని ఒక్కో షాపులో నిత్యం లక్షల్లో మద్యం బాటిళ్లు విక్రయిస్తున్నా ఒక్క రూపాయికి బిల్లులు ఇవ్వడం లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న ఈ ఘరానా మోసం మరోసారి ప్రభుత్వపు దందా స్టైల్‌ను బట్టబయలు చేస్తోంది.

బిల్లులు బేజారు

మార్కెట్లో లభ్యమవుతోన్న పలు స్థానిక, విదేశీ బ్రాండ్ల మద్యం బాటిళ్లను వైసీపీ ప్రభుత్వం ఏలూరు జిల్లాలో అను మతించిన 150 మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్నారు. మద్యపాన నిషేధం హామీ ఇచ్చిన జగన్‌ 2019లో అధికారం లోకి రాగానే, కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ మే మద్యం దుకాణాలను తెరిచి, సూపరిండెంట్లను, ఉద్యోగు లను నియమించి మరీ విక్రయాలు జరిపిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు నగదు తప్ప డెబిట్‌ కార్డులు, ఫోన్‌పే, పేటీఎంల ద్వారా విక్రయాలకు ప్రభుత్వం అనుమ తించలేదు. ప్రతిపక్షంతోపాటు జనసేన, వామపక్షాల వరుస విమర్శలకు దిగొచ్చిన ప్రభుత్వం ఎట్టకేలకు చెల్లింపుల్లో వినియోగదారుడికి వెసులుబాటు కల్పించింది. నాలుగున్న రేళ్లుగా జరుగుతున్న మోసాన్ని ఎవరూ గమనించకుండా జాగ్రత్తపడింది. జిల్లాలోని 150 దుకాణాల్లో రోజుకు రూ.2.70 కోట్ల వ్యాపారం జరుగుతున్నా ఏ ఒక్క దుకాణంలోనూ అమ్మిన మద్యానికి రశీదులు ఇవ్వకపోవడం గమనార్హం. బాటిళ్లపై ఉన్న ధరలకు రూపాయి ఎక్కువ తక్కువ లేకుండా అమ్ముతున్నామని చెప్పే ప్రభుత్వ పెద్దలు, పన్నుల శాఖకు ఎగనామం పెడుతున్నామని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. నెలలో ఒక్క ఏలూరు జిల్లా నుంచే రూ.81 కోట్ల వ్యాపారం చేస్తోన్న ఈ మద్యం దుకాణాలు బిల్లులను గాలికొదిలేసి పన్నుల ఎగవేతకు రాచమార్గం వెతుక్కుంది. ఈ క్రమంలో ఏ ఏ బ్రాండ్ల బాటిళ్లు, బ్రాండ్లు, ఎన్నెన్ని విక్రయిం చారన్న ప్రశ్నలు తలెత్తితే, దుకాణాల్లో పనిచేసే సిబ్బంది చూపే పొంతన లేని లెక్కలనే ప్రామాణికంగా తీసుకోవడమే తప్ప అధికారులు కూడా ప్రశ్నించలేని పరిస్థితిని ఏపీలో అధికార ప్రభుత్వం తీసుకొచ్చింది.

యానాం–కల్తీ మద్యం ?

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కల్తీ మద్యం రాజ్యమేలుతోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికితోడు అందుబాటులో ఉన్న యానాం నుంచి మద్యాన్ని భారీగా జిల్లాలకు తరలిస్తున్నారని సమాచారం. ఇలా యానాం నుంచి తీసుకొచ్చిన మద్యం బాటిళ్లపై ధరల లేబుళ్లను తొలగించి, ఏపీలో అమలవుతోన్న ధరలకే విక్రయిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ క్రమంలో నకిలీ లేబుళ్లతోనే గాక, దుకాణాల్లోకి మద్యం బాక్సులు చేరాక కొందరు ఆ బాక్సుల్లోని మందును కల్తీ చేస్తూ, అక్రమ ఆదాయానికి తెర తీస్తున్నారు. ఈ విషయం పలువురు అధికారుల దృష్టిలో ఉన్నా, మామూళ్ల మత్తులో పడి పట్టించుకోవడం లేదు. అదేమంటే ప్రభుత్వం నిర్ణయిచిన ధరల కంటే అధిక ధరలకు విక్రయించినా, నిర్ణీత సమయం మించి విక్రయాలు జరిపినా కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసి ప్రశాంతంగా కూర్చుంటు న్నారు. అంతే తప్ప విక్రయించే బాటిళ్లకు బిల్లులు ఇవ్వకపోవడం, కల్తీ మద్యం, యానాం బాటిళ్ల రాక వంటి వాటిపై నాలుగున్నరేళ్లుగా ఒక్క స్టేట్‌మెంట్‌ ఇవ్వలేకపోతున్నారు. ఒకవేళ ఏదేని అధికారులు చొరవ చూపి, తనిఖీలు చేపడితే రాజకీయ శక్తులు అడ్డం పడిపోతూ కార్యాలయాలకు పిలిపించుకుని మరీ వార్నింగ్‌లు ఇస్తుండడం అధికారుల చేతులు కట్టేస్తున్నాయి.

చెప్పిందేంటి ? చేస్తున్నదేంటి ?

వినియోగదారుల ఫోరం కొనుగోలుదారులకు స్పష్టమైన ఆదేశాలను ఆది నుంచి జారీ చేస్తూనే ఉంది. ఏదేని వస్తువు కొనుగోలు చేశాక బిల్లులు కచ్చితంగా తీసుకోవాలని, కొనుగోలు అనంతరం ఏదైనా సమస్య వస్తే ఆ బిల్లు ఆధారంగానే సమస్య పరిష్కరించుకోవచ్చని వివరిస్తోంది. కానీ, చాలా మంది తక్కువ ధరలకు వస్తున్నాయనో, పన్నుల నుంచి మినహాయింపు కోసమనో భ్రమిస్తూ, అమ్మకందారుల నుంచి బిల్లుల కోసం పెద్దగా ఒత్తిడి చేయరు. ఒకటి అరా ఈ చట్టాలపై అవగాహన ఉన్న వాళ్లు మినహా ఎక్కువగా ఎవరూ బిల్లుల ఊసెత్తరని పసిగట్టిన మద్యం దుకాణాలు, కొనుగోలు దారుల నిర్లక్ష్యాన్ని క్యాష్‌ చేసుకుం టోంది. ఒకటి అరా బాటిళ్లే కాదు, బాక్సులకు బాక్సులు కొనుగోలు చేసే వారికీ బిల్లులు ఇవ్వరు. అదేమంటే ట్యాక్సులతో సహా ఎక్కువ చెల్లించమని అడుగుతున్నారు. దీంతో ఏళ్ల తరబడి బిల్లుల ఊసే లేకుండా జోరుగా విక్రయాలు జరుగుతోన్న ఏకైక రంగం ఈ మద్యం దుకాణాలే. కొన్ని చోట్ల మద్యం బాటిళ్లలో బల్లులు, నాచు, బొద్దింకలు దర్శనమిచ్చిన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇలా సమస్య ఎదురైతే సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్టు చేసి తృప్తి పడుతున్నారే తప్ప, బిల్లులు తీసుకుంటే వినియోగదారుల కోర్టుకు వెళ్లొచ్చన్న కనీస స్పృహను సామాన్యుడు కోల్పోతున్నాడు. ఇలా బిల్లులు లేకుండా కోర్టుకు వెళ్లినా, న్యాయస్థానాలు ఆ ఫిర్యాదులను స్వీకరించవు. చట్టంలో ఉన్న ఈ లొసుగులను అడ్డుపెట్టుకుని ఏలూరు జిల్లాలోని మందుబాబుల జేబులను ఈ మద్యం దుకాణాలు కొల్లగొడుతున్నాయి.

ఎమ్మార్పీకంటే ఎక్కువకు అమ్మట్లేదు

ప్రతీ షాపుల్లోనూ కంప్యూటర్లలో అమ్మిన బాటిళ్ల సీరియల్‌ నెంబర్లతో సహా నమోదవుతుంది. బాటిల్‌పై ఉన్న ధరల ప్రకారమే వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం జారీ చేసిన బార్‌ కోడ్‌తోనే నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఉన్న 16 బార్లు, 150 షాపులలో ఎక్కడా ఎమ్మార్పీ కంటే అధికంగా ఒక్క పైసా అదనంగా తీసుకోవట్లేదు. ప్రభుత్వ షాపుల్లో కల్తీ జరిగే అవకాశం లేదు. తరచూ స్టాకును తనిఖీ చేస్తుంటాం. తీసుకున్న స్థలంలోనే స్టాకు ఉంటుంది. జిల్లాలో ఎక్కడైనా ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవు.

– గౌరీశ్వరరావు, ఎక్సైజ్‌ శాఖ జిల్లా సూపరింటెండెంట్‌

Updated Date - 2023-09-22T00:16:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising