ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

లెప్రసీ సర్వేలో 960 అనుమానిత కేసుల గుర్తింపు

ABN, First Publish Date - 2023-07-06T00:47:30+05:30

జిల్లావ్యాప్తంగా గత నెల 26వ తేదీ నుంచి వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన లెప్రసీ సర్వేలో 960 అనుమాన కేసులను గుర్తిం చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం టౌన్‌, జూలై 5 : జిల్లావ్యాప్తంగా గత నెల 26వ తేదీ నుంచి వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన లెప్రసీ సర్వేలో 960 అనుమాన కేసులను గుర్తిం చారు. ఇందులో నలుగురికి కుష్టు వ్యాధి వున్నట్లు నిర్ధారించారు. ఈ నెల 16 వరకు సర్వే జరగనుం డగా ఇప్పటి వరకు 15 శాతం పూర్తయ్యింది. జిల్లాలో 76 పాత కేసులున్నాయి. వీరికి ఆరు నెలల పాటు వైద్య సేవలందిస్తే పూర్తిగా నయమయ్యే అవకాశాలు ఉన్నాయి. కరోనా సమయంలో రెండేళ్ళ పాటు చాలామంది శరీరంపై చిన్న చిన్న మచ్చలు ఉన్నా చూపించకపోవటం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది జూన్‌లో ఒకసారి సర్వే చేయగా, తాజాగా మరోసారి చేపట్టారు. కొత్త కేసులు ఏమైనా ఉన్నాయా ? అనే దానిని నిర్ధారిస్తున్నారు. జీరో కేసులే లక్ష్యంగా ఈ సర్వే, వైద్య చికిత్సలు అందిం చాలని నిర్ణయించారు. అందుకే శరీరంపై ఎలాంటి మచ్చలు కనిపించినా నమోదు చేయాలని వైద్యాధి కారులు ఆశా వర్కర్లకు ఆదేశాలు జారీచేశారు. మచ్చలు కలిగిన వారిని డీపీఎం పరీక్షలు చేసి నిర్ధారణ చేస్తారు. అనుమానిత మచ్చలన్నీ లెప్రసీ కాదని, అయితే ఇలా చేయటం వల్ల సరైన సమ యంలో గుర్తించే వీలు కలుగుతుంది.

ఇంటింట సర్వేకు జిల్లావ్యాప్తంగా 1,235 మంది ఆశా వర్కర్లు సర్వే చేస్తున్నారు. మగ వారిని పరీక్షించేందుకు ఆశావర్కరు మగ వలంటీరును తీసుకు వెళుతు న్నారు. రోజుకు 20 ఇళ్లు చొప్పున సర్వే చేసి సంబంఽ దిత వివరాలను అదే రోజు ఆన్‌లైన్‌ చేస్తున్నారు. దీనివల్ల వెంటనే చర్యలు తీసుకుంటారు.

Updated Date - 2023-07-06T00:47:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising