బాలుర వసతి గృహం తనిఖీ
ABN, First Publish Date - 2023-03-25T23:55:23+05:30
భీమవరం మండలం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి డి.ధనరాజు కోడవల్లి రోడ్డులో ఉన్న బీసీ సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఆకిస్మిక తనిఖీ చేశారు.
బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేస్తున్న 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి డి.ధనరాజు
భీమవరం క్రైం, మార్చి 25 : భీమవరం మండలం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి డి.ధనరాజు కోడవల్లి రోడ్డులో ఉన్న బీసీ సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఆకిస్మిక తనిఖీ చేశారు. బాలురతో మాట్లాడి హాస్టల్‌లో అందిస్తున్న ఆహార పదార్ధాలు, విజిటింగ్ డాక్టర్ గురించి, మంచినీరు, డ్రైనేజీ, పరిసరాల శుభ్రత వంటి వాటిపై అడిగి తెలుసుకున్నారు. తదనంతరం వంటశాలను పరిశీలించి అక్కడ ఉన్న వాడిపోయిన కూరగాయాలపై ఆరా తీశారు. తాజా కూరగాయలు మాత్రమే వాడాలని వార్డెన్‌కు సూచనలు ఇచ్చారు.
Updated Date - 2023-03-25T23:55:23+05:30 IST