ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

68 కాంట్రాక్టు ఉద్యోగాలు..6,823 మంది అభ్యర్థులు

ABN, First Publish Date - 2023-09-20T00:47:54+05:30

68 వివిధ కేడర్ల ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్‌ను జారీ చేయగా 6,823 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఏలూరు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 19 : జాతీయ ఆరోగ్య పథకం (ఎన్‌హెచ్‌ఎం) జిల్లా ప్రాజెక్టులో కాంట్రాక్టు/అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ చేపట్టిన వివిధ వైద్యఉద్యోగాల నియామకాలకు విపరీతమైన పోటీ నెలకొంది. మొత్తం 68 వివిధ కేడర్ల ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్‌ను జారీ చేయగా 6,823 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు 11కి 41 మంది, స్టాఫ్‌నర్స్‌ పోస్టులు 25కి 2,708 మంది, ఫార్మసిస్టు 10 పోస్టులకు 746 మంది, ల్యాబ్‌టెక్నీషియన్‌ 4 పోస్టులకు 446 మంది, డేటా ఎంట్రీ అపరేటర్‌ ఆరు పోస్టులకు 1,124 మంది, లాస్ట్‌గ్రేడ్‌ సర్వీసెస్‌ 12 పోస్టులకు 1,758 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల కంప్యూటరీకరణ జరుగు తోంది. వచ్చే సోమవారం నాటికి కేడర్లవారీగా మెరిట్‌లిస్టును కలెక్టర్‌ అప్రూవల్‌ తీసుకుని ప్రదర్శనకు పెట్టేలా కసరత్తు చేస్తున్నారు. మెరిట్‌ జాబితాపై ఏవైనా అభ్యంతరా లుంటే వాటిని పరిష్కరించేందుకు వ్యవధి తీసుకుని, ఫైనల్‌ మెరిట్‌లిస్టును ప్రకటిస్తారు. రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను అక్టోబరు 5వతేదీ నాటికి ముగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Updated Date - 2023-09-20T00:47:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising