ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు ఇబ్బంది రానీయం : జేసీ

ABN, First Publish Date - 2023-04-18T00:24:35+05:30

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని జేసీ బి.లావణ్య వేణి తెలిపారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్న జేసీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉంగుటూరు/నిడమర్రు ఏప్రిల్‌ 17: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని జేసీ బి.లావణ్య వేణి తెలిపారు. నారాయణపురం, చేబ్రోలు రైతు భరోసా కేంద్రాలను సోమవారం పరిశీలించి రైతులకు గోనె సంచుల సరఫరా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తేమ శాతం యంత్రాలను పరిశీలించారు. జిల్లాలోని 247 రైతు భరో సా కేంద్రాలను క్లస్టర్లుగా గుర్తిస్తూ 136 రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తారన్నారు. రైతులకు ఏ ఇబ్బంది కలిగినా 1800–425–6453 టోల్‌ ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేయాలన్నారు.

‘ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధం

నిడమర్రు మండలంలో ఈ–క్రాప్‌ నమోదు ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆయా రైతు భరోసా కేంద్రా ల ద్వారా ధాన్యం కొనుగోలుకు సిద్ధం గా ఉన్నాయని జడ్పీ సీఈవో, మండల ప్రత్యేకాధికారి రవికుమార్‌ అన్నారు. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో మండల స్థాయి అధికారు లు, సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో గ్రామాల వారీగా రబీ సీజన్‌ ధాన్యం కొనుగోలు లక్ష్యాలను నిర్దేశించారు. ఎంపీడీవో పీవీ ప్రకాశ్‌, తహసీల్దార్‌ సాయిరాజ్‌, ఏవో బెన్సీ థామస్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-04-18T00:24:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising