ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మునిసిపాలిటీ పేరు మార్చేద్దాం

ABN, First Publish Date - 2023-05-31T23:41:51+05:30

జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి వైఎస్‌ రాజ శేఖర్‌రెడ్డి పేరు పెట్టాలని పాలకవర్గ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు తీర్మానించారు.

మున్సిపల్‌ సమావేశంలో కౌన్సిలర్లు, చైర్‌పర్సన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైఎస్‌ఆర్‌ పేరు పెట్టాలని జంగారెడ్డిగూడెం కౌన్సిల్‌ తీర్మానం

టీడీపీ, జనసేన కౌన్సిలర్ల అభ్యంతరం

జంగారెడ్డిగూడెం, మే 31: జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టాలని పాలకవర్గ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు తీర్మానించారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ టీడీపీ, జనసేన కౌన్సిలర్లు డిసెంట్‌ సమర్పించారు. మున్సిపల్‌ పాలకవర్గ సమావేశాన్ని మున్సిపల్‌ కమి షనర్‌ భవాని ప్రసాద్‌ పర్యవేక్షణలో చైర్‌పర్సన్‌ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. అజెండాలో మున్సిపల్‌ కార్యాలయం పేరును వైఎస్‌ రాజశేఖరరెడ్డి పురపాలక సంఘంగా మార్పు చేసే అంశంపై టీడీపీ కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి, నంబూరి రామచంద్రరాజు, తెల్లగారపు జ్యో తి, జనసేన కౌన్సిలర్‌ వలవల తాతాజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ వైసీపీ కౌన్సిలర్ల మద్దతు అధికంగా ఉండడంతో మున్సిపాలిటీ పేరును వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పురపాలక సంఘంగా మార్పు చేయాలని ఏకగ్రీవ తీర్మానంగా ఆమోదించారు. అసంతృప్తి వ్యక్తం చేసిన కౌన్సిలర్లు చైర్‌ పర్సన్‌ బత్తిన నాగలక్ష్మికి డిసెంట్‌ సమర్పించారు. గతంలో ఎన్టీఆర్‌ పుర పాలక సంఘ కార్యాలయంగా నామకరణం చేసి శంకుస్థాపన జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రస్తుతం ప్రభుత్వ రికార్డులలో జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంగా మాత్రమే నమోదై ఉందని అందు వల్ల వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పురపాలక సంఘంగా మార్పు చేయడానికి ఆమో దించామని వైసీపీ కౌన్సిలర్లు తెలిపారు. అనంతరం పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి కొరకు కేటాయించిన నిధులపై చర్చ కొనసాగింది. ఈ క్రమంలో కౌన్సిలర్‌ చిటికెన మాట్లాడుతూ జగనన్న లేఅవుట్‌ కాలనీలలో నీటి సమస్య అధికంగా ఉందని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు నీటి సౌకర్యం లేక నిర్మాణాలు భీటలు వాలుతున్నాయన్నారు. తమ వార్డులలో నేటికీ తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని పలువురు కౌన్సిలర్‌లు అసహనం వ్యక్తం చేశారు. ఈ సమస్యను సకాలంలో పరిష్కరిస్తామని చైర్‌పర్సన్‌ బత్తిన నాగలక్ష్మి హామీ ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్‌ ఏఈ పి.సంధ్యా రాణి, పట్టణ ప్రణాళిక అధికారి జగదీశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రమణ, మేనేజర్‌ రమణ సిబ్బంది పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:41:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising