నాణ్యత లేని ఇళ్ల నిర్మాణాలు
ABN, First Publish Date - 2023-06-21T00:36:43+05:30
పేదల ఇళ్ల నిర్మాణంలో నిబంధనలు గాలికొదిలి నాణ్యత లేని ఇళ్లు కడుతున్నారని జనసేన నేతలు విమర్శించారు.
పోణంగి కాలనీలో జనసేన నేతల పరిశీలన
ఏలూరు కార్పొరేషన్, జూన్ 20: పేదల ఇళ్ల నిర్మాణంలో నిబంధనలు గాలికొదిలి నాణ్యత లేని ఇళ్లు కడుతున్నారని జనసేన నేతలు విమర్శించారు. పోణంగి జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను జనసేన జిల్లా అధికార ప్రతి నిధి రెడ్డి అప్పలనాయుడు, కార్యకర్తలు మంగళవారం పరిశీలించారు. ఇళ్ళ నిర్మాణాలు ప్రారంభించి రెండేళ్లైనా కనీసం ఒక శాతం పనులు కూడా పూర్తి కాలేదన్నారు. ఈ లేఅవుట్‌లో దాదాపు పది వేల కుటుంబాలకు సెంటు స్థలం చొప్పున కేటాయించారు. ఒక కాంట్రాక్టర్ ద్వారా నాణ్యత లేకుండా, నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేస్తున్నారన్నారు. తుప్పుపట్టిన ఇనుప చువ్వ, నాణ్యతలేని సిమెంటు, ఇటుక వాడుతున్నారన్నారు. ఇళ్ల నిర్మాణాల పేరుతో పేదవారిని ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. నగరానికి పది కిలోమీటర్ల దూరంలో కుటుంబానికి సెంటు స్థలం ఇవ్వడం అన్యాయం అన్నారు. నివాసయోగ్యంగా లేని ప్రాంతంలో ఇళ్లు నిర్మించడం ఏమిటని ప్రశ్నించారు. ఇసుక వాడకుండా చెరువు మట్టితో ఫౌండేషన్ నింపుతున్నార న్నారు. ఈ ఇళ్లు నివాసయోగ్యం కాదన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, నిమ్మల శ్రీను, అల్లు సాయిచరణ్, కందు కూరి ఈశ్వరరావు, వీరంకి పండు, రెడ్డి గౌరీశంకర్, బోండా రామునాయుడు, పసుపులేటి దినేష్, బుద్దా నాగేశ్వరరావు, పావూరి వాణిశ్రీ, కోలా సుజాత, తుమ్మపాల ఉమాదుర్గ, జి.పద్మ, దుర్గాబీబీ పాల్గొన్నారు.
ముద్రగడ కాపు ఉద్యమాన్ని మధ్యలోనే వదిలేశారు
చింతలపూడి: పవన్‌కల్యాణ్‌ను విమర్శించే అర్హత ముద్రగడకు లేదని జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి టి.నాగ విజయకుమార్ అన్నారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రం ఈబీసీ రిజర్వే షన్ పది శాతం ఇవ్వకముందు బీసీ రిజర్వేషన్ కావాలంటూ పళ్లేలు మో గించి ఉద్యమం చేయించిన ముద్రగడ మధ్యలోనే ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ఈబీసీలకు కేంద్రం పది శాతం రిజర్వేషన్ కల్పిస్తే చంద్రబాబు తన ప్రభుత్వంలో ఐదు శాతం కాపు రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం అనుమతికి పంపించారన్నారు. ఈలోగా ఎన్నికలు వచ్చాయని, అప్పటివరకు చంద్రబాబు ను విమర్శించారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పర్యటించినప్పుడు కాపులకు బీసీ రిజర్వేషన్ ఇవ్వలేనని ప్రకటించినా ఉద్యమం ఎందుకు ఆపా రని నిలదీశారు. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌పై విమర్శలు చేయడానికి వైసీపీ నుంచి ముడుపులు తీసుకున్నారా అని విజయకుమార్ నిలదీశారు. ముద్రగడకు పవన్‌కల్యాణ్‌ను విమర్శించే అర్హత లేదన్నారు.
Updated Date - 2023-06-21T00:36:43+05:30 IST